గర్ల్ ఫ్రెండ్ ముద్దు కోసం వావ్ అనిపించే ట్రిక్
గర్ల్ ఫ్రెండ్ ముద్దు కోసం ప్రియుడు భలే ప్లాన్ వేశాడని చెప్పాలి. ఒకే దగ్గర కూర్చున్న ఒక జంటలో గాళ్ ఫ్రెండ్ సీరియస్ గా తన పని మీద తాను ఉంటుంది.
ప్రియురాలి మనసు దోచుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆమె ముద్దు కోసం ప్రియుడు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ముద్దు ట్రిక్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇలా చేస్తే.. వద్దన్నా.. ప్రియురాలి నుంచి ముద్దులు ఖాయమన్నట్లుగా ఉన్న ఈ చిట్టి వీడియోను చూసినంతనే.. పెదాల మీద చిరునవ్వు ఖాయం. వైరల్ గా మారిన ఈ ముద్దు ట్రిక్ మంచిగా వర్కువుట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గర్ల్ ఫ్రెండ్ ముద్దు కోసం ప్రియుడు భలే ప్లాన్ వేశాడని చెప్పాలి. ఒకే దగ్గర కూర్చున్న ఒక జంటలో గాళ్ ఫ్రెండ్ సీరియస్ గా తన పని మీద తాను ఉంటుంది. అంతలో మనోడు రొమాంటిక్ గా ఆమెను కిస్ చేస్తాడు. దీంతో పెదాల మీద చిరునవ్వుతో బాయ్ ఫ్రెండ్ కు ముద్దు ఇస్తుంది అతగాడి గాళ్ ఫ్రెండ్. ఒక ముద్దుతో సరిపెట్టుకోవటం ఇష్టం లేని ఆ కుర్రాడు భలే ప్లాన్ చేస్తాడు.
తన గాళ్ ఫ్రెండ్ పెట్టిన ముద్దును.. సీరియస్ గా చేతితో తుడిచేసుకుంటాడు. దీంతో.. సదరు అమ్మాయి కాస్త ఫీల్ అయి.. పంతంగా మరోసారి ముద్దు పెడుతుంది. మళ్లీ.. మనోడు పిచ్చ లైట్ అన్నట్లుగా.. పట్టించుకోవట్లేదన్న సంకేతాన్ని ఇచ్చేలా మరోసారి.. తన చేతితో చెంపల మీద పెట్టిన ముద్దును తుడిచేసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తాడు. దీంతో.. సదరు అమ్మాయి మరింత ఘాటైన ముద్దుల్ని పెడుతుంది. ఇలా చేసిన తర్వాత.. అప్పటివరకు గంభీరంగా ఉన్న అతడి ముఖం.. ఆనందంతో నవ్వేస్తాడు.
అయితే.. ఈ ట్రిక్ కు అందరు అమ్మాయిలు ఒకేలా స్పందిస్తారనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. కొంతమంది ఈ వీడియోలో కుర్రాడు చేసినట్లుగా చేస్తే.. ఒళ్లు మంటతో రెండు పీకినా పీకుతారు. అందుకే.. ఈ వైరల్ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి. అంతే తప్పించి.. గుడ్డిగా మాత్రం ఫాలో కావొద్దంటున్నారు. మీ ప్రియురాలి మైండ్ సెట్ కు తగ్గట్లే రియాక్టు కావాలంటూ కామెంట్ బాక్సుల్లో సూచన చేస్తున్నారు. ఈ రొమాంటిక్ వీడియో ఇప్పటివరకు 70 లక్షల మంది వరకు వీక్షించారు. ఎక్స్ లో పోస్టు చేసిన ఈ కిస్ ట్రిక్ చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరూ ఓ లుక్ వేయండి.