4ఏళ్ల బాలుడి వల్ల పగిలిన జాడీ.. దాని వయసు 3500 ఏళ్లు!?
మ్యూజియంలలో వేల ఏళ్ల నాటి ప్రాచీన సంపదను దాచి, ప్రదర్శనకు ఉంచుతారనే సంగతి తెలిసిందే.
మ్యూజియంలలో వేల ఏళ్ల నాటి ప్రాచీన సంపదను దాచి, ప్రదర్శనకు ఉంచుతారనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలైన వాటిని అత్యంత భద్రంగా చూసుకుంటారు. ఈ అద్భుత కళాఖండాలను కంటికి రెప్పలా కాపాడుతుంటారు మ్యూజియం సిబ్బంది. అయితే అనూహ్యంగా సుమారు 3వేల ఏళ్ల నాటి ఓ కళాఖండం ముక్కలైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును... ఓ మ్యూజియంలో భద్రపరిచిన సుమారు మూడు వేళ ఏళ్లనాటి ఓ అద్భుత కళాఖండం నాలుగేళ్ల చిన్నారి కారణంగా ముక్కలైంది. ఈ ఘటన ఇజ్రాయేల్ లోని ఓ మ్యూజియంలో చోటు చేసుకుంది. ఇది బైబిల్ లోని దావీదు మహారాజు, సొలోమోను మహారాజుల కాలం నాటికంటే ముందుదని చెబుతున్నారు. వీటిలో వైన్, ఆలివ్ ఆయిల్ వంటివి భద్రపరిచేవారని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఇజ్రాయేల్ లోని హైఫాలో ఉన్న హి మ్యూజియంలో అనేక కళాఖండాలున్నాయి. వీటిలో సుమారు 3000 ఏళ్ల క్రితం నాటిదని చెప్పే ఓ అరుదైన జాడీ కూడా ఉంది. దీనికి అద్భుత కళాఖండంగా గుర్తింపు ఉంది. దీంతో... స్పెషల్ అట్రాక్షన్ గా ఉండే ఈ జాడీని ఈ మ్యూజియం ఎంట్రన్స్ లో ఉంచారు.
ఈ క్రమంలో ఇటీవల అలెక్స్ అనే వ్యక్తి తన నాలుగేళ్ల బాలుడితో కలిసి మ్యూజియం సందర్శంకు వచ్చాడు. ఈ క్రమంలో ఆ జాడీలో ఏముందో చూడాలనే ఉత్సాహంతో అందులోకి తొంగి చూశాడు. దీంతో... ఆ జాడీ కిందపడిపోయింది.. ముక్కలైపోయింది! ఈ సమయంలో పగిలిన ఆ కళాఖండం పక్కన బాలుడు నిలబడి ఉండటం చూసి అలెక్స్ షాక్ కి గురయ్యాడు.
ఈ సమయంలో... ఆ కళాఖండం పగిలిపోవడానికీ తన కుమారుడుకి ఏమీ సంబంధం లేదని, దాన్ని అతడు పాడేయలేదని పేర్కొన్నాడు. అయితే... తానే ఆ జాడీని పడేశానని బాలుడు చెప్పడంతో.. ఆ విషయాన్ని సెక్యూరిటీ గార్డుకు చెప్పి వెళ్లిపోయాడు. అయితే కొన్ని రోజుల తర్వాత మ్యూజియం నిర్వాహకులు అలెక్స్ కి అతని కుమారుడికి ఆహ్వానం పలికారు. ఒకసారి వచ్చి వెళ్లమని కోరారు.
ఆ సమయలో అలెక్స్ తన కుమారుడిని తీసుకుని మ్యూజియంకు వచ్చాడు. ఆ సమయంలో పగిలిన జాడీ తిరిగి అతికించి ఉండటం చూసి ఆనందంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సందర్భంగా స్పందించిన మ్యూజియం అధికారులు... ఒక్కోసారి కొంతమంది ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తుంటారు కానీ... ఈ విషయంలో మాత్రం బాలుడు ప్రమాదవశాత్తు పడేశాడని చెప్పారు. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.