బాలయ్య ఇంటి మీదకు బుల్డోజర్ ??
మరి అలాంటిది బాలయ్య ఇంటినే బుల్డోజర్ టార్గెట్ చేస్తుంది అంటే ఎవరూ నమ్మలేని వార్తే. కానీ అదే నిజం అంటున్నారు. ఇక బాలయ్యతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి మీదకు కూడా బుల్డోజర్ వస్తుందని అంటున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అవి గతంలో ఏ సీఎం తీసుకోని విధంగా ఉంటున్నాయని అంటున్నారు. టాలీవుడ్ ప్రముఖుడు అయిన అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ ని కూల్చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇపుడు తన బుల్డోజర్ ని ఏకంగా ప్రముఖ నటుడు టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి మీదకు పంపించనుందా అన్నది చర్చగా ఉంది.
రేవంత్ రెడ్డి టీడీపీలోనే రాజకీయంగా ఎదిగారు. అంతే కాదు చంద్రబాబుకు శిష్యుడిగానూ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లోకి వచ్చి ఒక వెలుగు వెలిగారు. ఈ రోజున సీఎం హోదాలో ఉన్నారు. ఆయన రాజకీయ కష్టం వల్ల ఇవన్నీ సాధించుకున్నా రేవంత్ రెడ్డి అంటే టీడీపీతో ఉన్న అనుబంధాన్నే అంతా ప్రస్తావించడం సహజం.
పైగా నందమూరి బాలక్రిష్ణతో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. మరి అలాంటిది బాలయ్య ఇంటినే బుల్డోజర్ టార్గెట్ చేస్తుంది అంటే ఎవరూ నమ్మలేని వార్తే. కానీ అదే నిజం అంటున్నారు. ఇక బాలయ్యతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి మీదకు కూడా బుల్డోజర్ వస్తుందని అంటున్నారు.
ఇంతకీ విషయం ఏంటి అంటే ఫిల్మ్ నగర్ లో ఉన్న బాలక్రిష్ణ ఇంటిటికి ఏకంగా ఆరేడు అడుగుల వరకూ మార్కింగ్ చేసి పెట్టారు అని అంటున్నారు. ఇక ఇదే పని మీద బాలయ్య ఇంటి దాకా బుల్డోజర్లు కూడా తీసుకుని వస్తాయని కూడా వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
అదే విధంగా కాంగ్రెస్ వృద్ధ నేత జానారెడ్డి ఇంటి దగ్గర కూడా మార్కింగ్ వేశారని అంటున్నారు. ఈ ఇద్దరి ఇళ్ళనే ఎందుకు టార్గెట్ చేశారు అంటే కేబీఆర్ పార్కు మొత్తంలో ఉన్న ప్రాంతాన్ని ఆనుకుని ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, అండర్ పాస్ లను పెద్ద ఎత్తున నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు
అందులో భాగంగా కొంత మేరకు ఈ ఇద్దరి భూములు కావాల్సి ఉందని అంటున్నారు. అందుకే భూసేకరణలో భాగంగానే మార్కింగులు చేశారని అంటున్నారు. అలా రానున్న రోజులలో ఈ ఇద్దరికి చెందిన కొంత భూమిని తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది.
ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం ఎవరి భూమి అయినా తీసుకోవచ్చు. ఈ తరహా భూసేకరణకు న్యాయపరమైన అడ్డంకులు కూడా ఉండేది లేదు. పాలకులు తలచుకోవాలే కానీ భూములు ఎగిరిపోవడం ఖాయం. అయితే ఈ తరహా భూసేకరణ చేసినపుడు తన తర భేదాలను చూస్తూ ఉంటారు.
మరి జానారెడ్డి కాంగ్రెస్ మనిషి, బాలయ్య కావాల్సిన మనిషి. అయినా అభివృద్ధి పనుల నేపధ్యంలో భూములు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే తమకు సమాచారం లేకుండా తమ ఇళ్ల వద్ద మార్కింగులు తీయడమేంటి అని ఈ ఇద్దరిలోనూ తీవ్ర అసంతృప్తి ఉందని అంటున్నారు.
మరో వైపు చూస్తే వరసబెట్టి సినీతారల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. నాగార్జునతో మొదలెట్టి అల్లు అర్జున్ తో ముందుకెళ్ళి బాలయ్యతో కధను రక్తి కట్టించడానికి చూస్తున్నారా అన్నది కూడా చర్చగా ఉంది.
అయితే తమ ప్రభుత్వానికి ఎవరు ఎంత సన్నిహితమైనా పట్టింపు లేదని పూర్తి పక్షపాత రహితంగా తాము డెసిషన్స్ తీసుకుంటున్నామని చెప్పడానికే ఈ తరహా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. మొత్తానికి ఇదే కనుక నిజమైతే మాత్రం మరో సంచలనానికి అంతా రెడీ కావాల్సిందే అని అంటున్నారు.