భార్యను చూస్తూ ఉండటం ఇష్టం.. మరో బిలియనీర్ కౌంటర్
అంతేనా.. అంతకంతకూ పని గంటల్ని పెంచేస్తూ.. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆఫీసుకు ఇవ్వాలన్న సందేశాలకు కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు.
లాంటి మాటలు బిజినెస్ టైకూన్ల నుంచి వస్తాయని ఊహించి ఉండం. కానీ.. ఇప్పుడు ఈ మాటలు ట్రెండీగా మారాయి. అంతేనా.. అంతకంతకూ పని గంటల్ని పెంచేస్తూ.. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆఫీసుకు ఇవ్వాలన్న సందేశాలకు కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు. అవును.. ఆ మధ్య ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. ఇటీవల ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలకు రెండు రోజుల క్రితం మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పంచ్ వేయటం తెలిసిందే.
ఎన్ని గంటలు పని చేశామన్నది ముఖ్యం కాదని.. ఎంత నాణ్యంగా పని చేశామన్నది ముఖ్యమన్న ఆయన మాటలు వైరల్ గా మారాయి. అంతేకాదు.. తన భార్యను చూస్తూ ఉండటం తనకెంతో ఇష్టమని పేర్కొనటం ద్వారా ఎల్ అండ్ టీ ఛైర్మన్ కు ఒక పంచ్ ఇచ్చారని చెప్పాలి. ఈ మధ్యన ఎల్ అండ్ టీ పెద్దాయన సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ.. ఆఫీసులో ఎక్కువగా ఉంటామని భార్యలకు చెప్పాలి. అవసరమైతే ఆదివారాలు కూడా పని చేయాలి’ అంటూ వ్యాఖ్యానించారు.
దీనికి కౌంటర్ గానే ఆనంద్ మహీంద్రా తన భార్యను చూస్తూ ఉండి పోవటం తనకెంతో ఇష్టమన్న ఆయన మాటలకు కొనసాగింపుగా తాజాగా మరో బిలియనీర్ రియాక్టు అయ్యారు. సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా మాట్లాడుతూ.. నా భార్య కూడా నేను మంచివాడినని అనుకుంటుంది. ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటమే తనకు ఇష్టం. క్వాంటిటీ కంటే క్వాలిటీనే ముఖ్యం. వర్కు లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి’ అంటూ తన మాటలతో ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా వ్యాఖ్యానించారని చెప్పాలి. ప్రొఫెషనల్ లైఫ్ కోసం పర్సనల్ లైఫ్ నాశనం చేసుకోవాలన్నట్లుగా మాట్లాడే వారికి.. ఆనంద్ మహీంద్రా.. పూనావాలా లాంటి వాళ్లు సరైన రీతిలో గడ్డి పెట్టారనే చెప్పాలి. రానున్న రోజుల్లో మరింత మంది పారిశ్రామికవేత్తలు ఈ తరహాలో వ్యాఖ్యానించటానికి అవకాశం ఉందని చెప్పాలి.