కలలలో సమాచార మార్పిడి... వాస్తవంగా మారిన సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్!

కల అనేది పూర్తిగా వ్యక్తిగతంగా ఉంటుంది. ఒకరికి వచ్చె కల మరొకరికి చెబితే తప్ప తెలుసుకునే అవకాశం ఉండదు.

Update: 2024-10-16 10:30 GMT

కల అనేది పూర్తిగా వ్యక్తిగతంగా ఉంటుంది. ఒకరికి వచ్చె కల మరొకరికి చెబితే తప్ప తెలుసుకునే అవకాశం ఉండదు. ఇక కలలో సమాచార మార్పిడి అనేది సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తప్ప మరొకటి కాదని అంటారు. ఈ సమయంలో... మెదడు తరంగాలను ఉపయోగించి ఇద్దరు వ్యక్తులు తమ కలలలో కమ్యునికేట్ చేశారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అవును... సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ ను వాస్తవంగా మార్చారు కాలిఫోర్నియాలోని శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా 'రెమ్ స్పేస్' అనే సంస్థ.. ఇద్దరు వ్యక్తులు నిద్రలో ఉన్నప్పుడు, స్పష్టమైన కలలు కంటున్నప్పుడు.. వారి మధ్య టూవే కమ్యునికేషన్ ను సక్సెస్ ఫుల్ గా ఏర్పాటుచేసింది. ఆర్.ఈ.ఎం (రెమ్) అనగా... రాపిడ్ ఐ మూవ్ మెంట్!

డైలీ మెయిల్ ప్రకారం... దీనికి సంబంధించిన ప్రయోగం సెప్టెంబర్ 24న జరిగింది. ఈ సమయంలో... డ్రిఫ్టింగ్ కు ముందు.. ఇందులో పాల్గొనేవారికి వారి మెదడు కార్యకలాపాలు, నిద్రా విధానలను నిజ సమయంలో పర్యవేక్షించే ప్రత్యేక పరికరాలను కనెక్ట్ చేశారు. ఇది వారి కలల స్థితిని ట్రాక్ చేస్తుంది.

ఇందులో ముందుగా.. మొదటి పార్టిసిపెంట్ స్పష్టమైన కలలోకి ప్రవేశించిన తర్వాత, సిస్టం మొదడు కార్యకలాపాలలో మార్పును గుర్తించింది. ఈ సమయలో కలలుకనేవారికి నిద్రలో ఉన్నప్పుడు "జిలక్" అనే పదం ఇయర్ బడ్ ల ద్వారా వినిపించారు. ఆ వ్యక్తి ఈ పదం విన్న తర్వాత బిగ్గరగా రిపీట్ చేసాడు.

కాసేపటి తర్వాత రెండవ పార్టిసిపెంట్ కూడా స్పష్టమైన కల స్థితికి చేరుకున్న తర్వాత.. ఇయర్ బడ్ ద్వారా "జిలక్" అనే పదాన్ని పంపించారు. ఈ సమయంలో ఆమె కూడా తన కలలో ఆ పదాన్ని విని బిగ్గరగా రిపీట్ చేసింది. మేల్కొన్న తర్వాత తన కలలో విన్న పదం "జిలక్" అని కన్ ఫామ్ చేసింది. ఇది కలలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఫస్ట్ సక్సెస్ ఫుల్ కమ్యునికేషన్ ను సూచిస్తుంది.

దీంతో... మానసిక ఆరోగ్య చికిత్సకు ఇది ఉపయోగపడుతుందని 'రెమ్ స్పేస్' విశ్వసించింది. దీనిపై స్పందించిన రెమ్ స్పేస్ సీఈవో మైఖేల్ రాదుగా... “నిన్న కలలో కమ్యునికేట్ చేయడం సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించింది.. రేపు ఈ టెక్నాలజీ లేకుండా మన జీవితాలను ఊహించుకోలేము” అని తెలిపారు.

Full View
Tags:    

Similar News