షాకింగ్ వీడియో... కారు దాడిలో 11 మంది మృతి... ఉగ్రవాది పనేనా?
ఈ సమయంలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారుతో షాపింగ్ లో బిజీగా, రద్దీగా ఉన్న జనాలపైకి దూసుకొచ్చాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు క్రిస్మస్ సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో... భారత్ తో పాటు పలు ప్రపంచ దేశాలో ఈ సందడి వాతావరణం నెలకొంది. క్రిస్మస్ షాపింగ్ లో జనం ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఈ సమయంలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారుతో షాపింగ్ లో బిజీగా, రద్దీగా ఉన్న జనాలపైకి దూసుకొచ్చాడు.
అవును... శుక్రవారం సాయంత్రం జర్మనీలోని మాగ్డేబర్గ్ లోని క్రిస్మస్ మార్కెట్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఓ వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా జనాల గుంపులోకి కారుతో దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో సుమారు 11 మంది మృతి చెందగా.. 60 మంది వరకూ గాయపడ్డారని, అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది!
ఈ సమయంలో కారు డ్రైవర్ ను వెంటనే అరెస్టు చేసిన పోలీసులు.. అతడు సౌదీ అరేబియాకు చెందిన 50 ఏళ్ల వైద్యుడు తలేబ్ ఏ గా గుర్తించారని అంటున్నారు. అతడు తొలిసారిగా 2006లో జర్మనీకి వచ్చి మాగ్డేబర్గ్ కు దక్షిణంగా సుమారు 25 మైళ్ల దూరంలో ఉన్న చిన్న టౌన్ లో వైద్యుడిగా పనిచేశారని అధికారులు చెబుతున్నారు.
ఈ దాడిలో.. ఓ బ్లాక్ బీ.ఎం.డబ్ల్యూ నేరుగా క్రిస్మస్ మార్కెట్ లోని జనాలపైకి దూసుకెళ్లింది. ఈ సమయంలో టౌన్ హాల్ వైపు సుమారు 400 మీటర్ల వేగంతో ప్రయాణించిందని చెబుతున్నారు. ఈ సమయంలో జనాలను తొక్కుకుంటూ ఆ కారు దూసుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సొషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలో.. దాడికి కొద్దిసేపటికి ముందు అనుమానితుడు కారును అద్దెకు తీసుకున్నాడని అంటున్నారు.. ఇదే సమయంలో అతడిది ఇస్లామిక్ నేపథ్యం అని చెబుతున్నారని తెలుస్తోంది! ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన దాడి అని అధికారులు భావిస్తున్నారు.
కాగా.. జర్మనీలో ప్రతీ ఏటా దాదాపు 2500 నుంచి 3000 వరకూ క్రిస్మస్ మార్కెట్ షాపులు ఉంటాయి. ఈ క్రమంలో గతంలోనూ తీవ్రవాదులు వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతారు. గత నెలలో క్రిస్మస్ మార్కెట్ పై దాడికి ప్రాణాళిక రచించారనే అనుమాతంతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.