అమ్మ అడిగిందని ఆమెను తీసుకొని స్కూటర్ మీద తీర్థయాత్రలు

కర్ణాటకలోని మైసూర్ కు చెందిన క్రిష్ణకుమార్ ఐటీ ఉద్యోగి. రూ.లక్షల్లో జీతం వచ్చేది. నాలుగేళ్ల క్రితం వారింట్లో చోటు చేసుకున్న విషాదం మొత్తం సీన్ మారిపోయేలా చేసింది.;

Update: 2025-03-09 06:30 GMT

బంధాలు.. అనుబంధాల చిక్కదనం తగ్గిపోతున్న ఈ రోజుల్లో అమ్మ కోసం.. ఆమె నోటి నుంచి వచ్చిన మాట కోసం లక్షల జీతాన్ని వదిలేసి.. ఆమెను తీసుకొని తీర్థయాత్రలు చేస్తున్న ఈ సూపర్ కొడుకు గురించి తెలుసుకోవాల్సింది. నలుగురికి చెప్పాల్సిందే. తీర్థయాత్రల్ని స్కూటర్ మీద చేస్తున్న ఈ అమ్మాకొడుకులు.. ఇప్పటికి 92 వేల కి.మీ. ప్రయాణించారు. త్వరలోనే లక్ష కిలోమీటర్ల మార్కును చేరుకోవటానికి దగ్గరగా ఉన్నారు. ఇంతకూ ఆ అమ్మా.. కొడుకుల కథేంటి? వారెందుకు తీర్థయాత్రల ట్రిప్ పెట్టుకున్నారు? ఇంతకూ ఈ సూపర్ కొడుకు ఏమంటారు? అన్న వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని మైసూర్ కు చెందిన క్రిష్ణకుమార్ ఐటీ ఉద్యోగి. రూ.లక్షల్లో జీతం వచ్చేది. నాలుగేళ్ల క్రితం వారింట్లో చోటు చేసుకున్న విషాదం మొత్తం సీన్ మారిపోయేలా చేసింది. నాలుగేళ్ల క్రితం క్రిష్ణకుమార్ తండ్రి దక్షిణామూర్తి అకాలమరణం చెందారు. దీంతో అతడి తల్లి రత్నమ్మ మనోవేదనకు గురయ్యారు. ఒక్కడే కొడుకు కావటంతో ఇంటికి వచ్చేశారు క్రిష్ణకుమార్.

తీర్థయాత్రలు చేద్దామని తల్లి కోరటంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన అతను 2018 జనవరి 14న యాత్ర మొదలు పెట్టారు. తండ్రి ఇష్టంగా కొనుక్కున్న స్కూటర్ మీదనే ప్రయాణించాలని నిర్ణయించారు.

ఇప్పటివరకు కేరళ.. తమిళనాడు.. పుదుచ్చేరి.. కర్ణాటక.. తెలంగాణ.. గోవా.. నాగాలాండ్.. త్రిపుర.. అసోం.. మేఘాలయ.. మిజోరం.. మహారాష్ట్ర.. ఆంధ్రప్రదేశ్ లతో పాటు నేపాల్.. భూటాన్.. మయన్మార్ దేశాల్లోని ఆలయాల్ని దర్శించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 92,591 కిలోమీటర్లు తిరిగినట్లుగా చెప్పారు. ప్రస్తుతం కాకినాడలోని రాఘవేంద్రస్వామి మఠాన్ని సందర్శించారు. ఇలాంటి కొడుకులు ఎంతమందికి ఉంటారు చెప్పండి? అందుకే.. ఇతడు సూపర్ కొడుకుగా చెప్పాలి.

Tags:    

Similar News