భూమికి పొంచి ఉన్న పెను ప్రమాదం..కారింగ్టన్ ఈవెంటే ఎందుకు కారణం..

గతంలో జరిగిందని గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా.. ఈ పరిస్థితి త్వరలో ఎదురు కాబోతోంది అని అంచనా..

Update: 2024-07-04 11:30 GMT

మనం చూసే ఈ ప్రపంచం కంటే కూడా మనకు తెలియని ప్రపంచం మన చుట్టూ ఎంతో ఉంది. ఈ అనంత విశ్వంలో ఊహకందని ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇవి మనల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తాయి. అటువంటి వాటిల్లో ముఖ్యమైనది ఈ విశ్వం అంతమందుతుంది అనే భయం. దీనిపై పలు రకాల సినిమాలను కూడా తీశారు. ఈ విషయం పక్కన పెడితే ఒక్కసారి ప్రపంచం మొత్తం విమానాలు రద్దయి.. సాటిలైట్ లో పనిచేయడం మానేసి.. ఇంటర్నెట్ అతలాకుతలమైతే ఎలా ఉంటుందో ఊహించండి..

ఆలోచించడానికి భయంకరంగా ఉన్న ఈ పరిస్థితి త్వరలో మనకు ఎదురు కాబోతోంది అంటే మీరు నమ్ముతారా. అనంత విశ్వం ఒక్కసారిగా చీకటి మయం అవ్వడంతో పాటు ఫోన్లన్నీ మూగబోతాయి.. వినడానికి ఆందోళన కలిగిస్తున్న ఈ పరిస్థితి 150 సంవత్సరాల క్రితం ఒకసారి సంభవించింది. దీన్నే కారింగ్టన్ ఈవెంట్ అని పిలుస్తారు.

గతంలో జరిగిందని గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా.. ఈ పరిస్థితి త్వరలో ఎదురు కాబోతోంది అని అంచనా..

కారింగ్టన్ ఈవెంట్:

Read more!

సుమారు 150 సంవత్సరాల క్రితం అంటే 1859, సెప్టెంబరు 2 న ఈ కారింగ్టన్ ఈవెంట్ ను అప్పటి శాస్త్రవేత్తలు గుర్తించారు. రిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్, అతని సహోద్యోగి రిచర్డ్ హోడ్ల్సన్ సూర్యునిపై ఉన్న చీకటి మచ్చల సమూహం పై అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా వారు సూర్యునిపై సంభవించిన ఒక భారీ పేలుడును గమనించారు. దీన్ని వారు కారింగ్టన్ ఈవెంట్ అని పేర్కొన్నారు. భూమి దృవప్రాంతాలపై ప్రభావాన్ని చూపించిన ఈ పేలుడు తొలి సౌర తుఫానుగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్పట్లో ఇప్పుడున్నట్టుగా సాటిలైట్లు, ఇంటర్ నెట్, సెల్ ఫోన్స్ వాడకాలు లేవు కాబట్టి నష్టం గురించి మనకు పెద్దగా తెలియలేదు.

అయితే 2003లో సంభవించిన సౌర తుఫాను దక్షిణ ఆఫ్రికా కమ్యూనికేషన్ వ్యవస్థలను చిన్నభిన్నం చేసింది. విద్యుత్ సౌకర్యాలను అస్తవ్యస్తం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేసింది. అప్పుడు సంభవించిన సౌర తుఫాన్ కి హాలోవీన్ సౌర తుఫాను అన్న పేరు పెట్టారు. అయితే రోజులలో మరిన్ని సౌర తుఫానులు భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సౌర తుఫాను కారణంగా మన భూమి అయస్కాంత క్షేత్రాలలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయని.. కొన్ని సందర్భాలలో అది బ్లాక్ అవుట్ కు దారితే అవకాశం కూడా ఉందని వారు పేర్కొంటున్నారు. విద్యుత్ వ్యవస్థలు కూలిపోవడంతో పాటు, సాటిలైట్ లో కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

రీసెంట్గా రెండు దశాబ్దాల తరువాత మే 10, 2024 న ఒక అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. వాతావరణంలో హెచ్చుతగ్గులు ఆ సమయంలో ఎంత ఇబ్బందికి గురిచేసాయో అందరికీ తెలుసు. తొలుత ఈ సౌర తుఫాను తీవ్రమైనది కాదు అన్న ప్రచారం జరిగింది. అయితే సన్స్పాట్ ఏఆర్ 3663 వద్ద ఈ సౌర తుఫాను కారణంగా రెండు భారీ విస్పోటనాలు జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సౌర తుఫాను కారణంగా రాబోయే రోజులలో భూమికి ప్రమాదం పొంచి ఉంది అన్న హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన మరింత సమాచారం కోసం పరిశోధనలు కూడా నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News

eac