ఈ సారి సొంతూరిలో... మంచు ఫ్యామిలీ పై వరుస కేసులు!

గత ఏడాది హైదరాబాద్ వేదికగా తీవ్ర సంచలనంగా మారిన ‘మంచు ఫ్యామిలీలో మంటలు’ వ్యవహారం ఇప్పుడు సొంత ప్రాంతానికి చేరినట్లు కనిపిస్తుంది.

Update: 2025-01-17 06:31 GMT

గత ఏడాది హైదరాబాద్ వేదికగా తీవ్ర సంచలనంగా మారిన ‘మంచు ఫ్యామిలీలో మంటలు’ వ్యవహారం ఇప్పుడు సొంత ప్రాంతానికి చేరినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో మంచు మనోజ్, మంచు మోహన్ బాబు వరుసగా కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఆ కేసు వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఇలా గత ఏడాది మంచు ఫ్యామిలీలో మంటల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో కొన్ని రోజులు సైలంట్ గా ఉన్నట్లు కనిపించిన వ్యవహారం సంక్రాంతి పండుగ వేళ సొంతూరికి చేరి మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

అవును... మోహన్ బాబు కుటుంబ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కనుమ రోజు నారావారిపల్లెకు మంచు మనోజ్ వెళ్లడం.. ఈ సందర్భంగా లోకేష్, రోహిత్ లను కలవడం.. అనంతరం మోహన్ బాబు విద్యాసంస్థలవైపు వెళ్లడం.. అక్కడున్న తన నానమ్మ, తాతయ్యల సమాధులను చూసి, దండం పెట్టుకుని వెళ్లాలని వచ్చినట్లు ఆయన చెప్పడం తెలిసిందే.

అయితే... ఈ వ్యవహారంలో మనోజ్ పై మోహన్ బాబు లేఖ విడుదల చేశారు! ఇందులో భాగంగా... సంక్రాంతి పండుగ రోజు మంచు మనోజ్ కుమార్ తన మేనత్త ఇంటికి నారావారి పల్లెకు వస్తానంటే ఆమె అంగీకరించలేదని.. అయినప్పటికీ కేవలం దురుద్దేశ్యంతోనే అతడు నారావారి పల్లెకు వచ్చాడని తెలిపారి. ఈ సందర్భంగా లోకేష్, రోహిత్ లను కలిసినట్లు తెలిపారు.

ఈ సమయంలో తిరిగి వెళ్తూ మోహన్ బాబు స్కూలు గేటు వద్ద సుమారు 200 మందితో చేరాడని.. స్కూలు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడని.. అయితే కోర్టు ఆదేశాల మేరకు లోపలికి వెళ్లకూడదని పోలీసులు చెప్పారని అన్నారు. ఈ సమయంలో డైరీ ఫారం గేటును ఎగిరి దూకి లోపలికి వెల్లాడని.. ఇది కచ్చితంగా కోర్టు దిక్కారనే అని, అతడిపై చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు కోరారు.

ఈ నేపథ్యంలో ఆ మరుసటి రోజు మంచు మనోజ్ ఈ వ్యవహారంపై చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కనుమ రోజు మోహన్ బాబు స్కూల్ వద్ద జరిగిన ఘటనపై చర్చించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. చంద్రగిరి స్టేషన్ లో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో మంచు ఫ్యామిలీ మెంబర్స్ పై కేసులు నమోదయ్యాయి.

ఇందులో భాగంగా... మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనికతో పాటు మరో ముగ్గురిపై మోహన్ బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడి ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో... తనపైనా, తన భార్యపైనా దాడికి యత్నించారంటూ మనోజ్ ఫిర్యాదు చేయడంతో.. మోహన్ బాబు పీఏతో పాటు ఎంబీ యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

Tags:    

Similar News