మణికొండలోని కేవ్‌ పబ్‌ ఘటన... తెరపైకి సంచలన విషయాలు!

డ్రగ్స్ కి వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. తెర వెనుక ఇంకా విచ్చలవిడి ఘటనలు జరుగుతున్నాయి

Update: 2024-07-08 06:08 GMT

డ్రగ్స్ కి వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. తెర వెనుక ఇంకా విచ్చలవిడి ఘటనలు జరుగుతున్నాయి.. తెరపైకి వస్తున్నాయి! ఈ విషయంలో పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఫలితంగా పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మణికొండలోని కేవ్ పబ్ ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి!

అవును... తాజాగా మణికొండలోని కేవ్ పబ్ లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్.వో.టీ. పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన మాదాపూర్ డీసీపీ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. కేవ్ పబ్ లో పట్టుబడినవారికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తే 25 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తేలిందని అన్నారు.

వీరందరిపైనా ఎన్.డి.పి.ఎస్. సెక్షన్ కింద కేసుపెట్టి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇలా గంజాయి, మాదక ద్రవ్యాలు తీసుకున్నవారిలో ఎక్కువమంది విద్యార్థులూ, ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించారు. వీరు బయట డ్రగ్స్ తీసుకునే పబ్ లోకి వచ్చినట్లు విచారణలో తేలిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేశారని.. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించామని అన్నారు.

అయితే... మాదక ద్రవ్యాలను ప్రోత్సహించినందుకు కేవ్ పబ్ ను సీజ్ చేయడంతోపాటు.. ఆ పబ్ మేనేజర్ శేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు! పబ్ యజమానులు నలుగురు మాత్రం పరారీలో ఉన్నారని.. త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Tags:    

Similar News