బిగ్ న్యూస్... 18 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లను నిషేధించిన కేంద్రం!

అవును... అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఆన్ లైన్ వేదికలకు కేంద్రం ఝులక్ ఇచ్చింది.

Update: 2024-03-14 08:57 GMT

ప్రధానంగా కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచీ ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ ఫారమ్స్ వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో ఆధరణ దొరికేసరికి కొన్ని ఆన్ లైన్ వేదికలు హద్దుమీరుతున్నాయి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో అలాంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఇందులో భాగంగా 18 ఓటీటీలను నిషేధించింది.

అవును... అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఆన్ లైన్ వేదికలకు కేంద్రం ఝులక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీచేసినప్పటికీ... వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడంతో కొరడా ఝుళిపించింది. ఇందులో భాగంగా 18 ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ తో పాటు 10 యాప్ లు, 18 వెబ్ సైట్లు, 57 సోషల్ మీడియా అకౌంట్ లను తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రం సమాచార ప్రసార శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇదే సమయంలో తొలగించిన 57 సోషల్ మీడియా అకౌంట్ల లోనూ 17 ఇన్ స్టాగ్రాం లో, 16 ఎక్స్ (ట్విట్టర్)లో, 12 ఫేస్ బుక్ లో, 12 యూట్యూబ్ లో ఉన్నట్లు తెలిపింది. ఇక నిషేధించిన 10 యాప్ లలో 7 గూగుల్ ప్లే స్టోర్ లో ఉండగా.. మిగిలిన 3 యాప్ లూ యాపిల్ యాప్ స్టోర్ లోనివిగా గుర్తించినట్లు వెల్లడించింది.

కాగా... ఈ విషయాలపై రెండు రోజుల క్రితం స్పందించిన మంత్రి అనురాగ్ ఠాకూర్... దేశీయంగా ఉన్న 18 ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ అసభ్యకరమైన, అశ్లీలమైన కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని.. వాటిపై చర్యలు ఉంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తొలగించిన 18 ఓటీటీలలో నుంచి సుమారు కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నట్లు తెలిపారు. ఇక వీటిలో ప్రతీ ఓటీటీ వేదికకూ సుమారు 32 లక్షల వ్యూస్ ఉన్నట్లు వెల్లడించారు.

కేంద్రం తొలగించిన ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ వివరాలు!:

డ్రీంస్ ఫిలింస్

వూవి

ఎస్మా

అన్ కట్ అడ్డా

ట్రి ఫ్లిక్స్

ఎక్స్ ప్రైం

నియాన్ ఎక్స్ వీఐపీ

బేషరంస్

హంటర్స్

రాబిట్

ఎక్స్ స్ట్రా మూడ్

న్యూ ఫ్లిక్స్

మూడ్ ఎక్స్

మోజ్ ఫ్లిక్స్

హాట్ షాట్స్ వీఐపీ

ఫుగి

చీకూ ఫ్లిక్స్

ప్రైం ప్లే

Tags:    

Similar News