అలాగ వద్దు బాబూ... చంద్రబాబు కి సూట్ కాని పాలిటిక్స్

చంద్రబాబు అంటే ఎవరికైనా వెంటనే తట్టేది ఏంటి అంటే ఆయన విజనరీ అని. డెవలప్మెంట్ చేస్తారని.

Update: 2024-09-29 03:33 GMT

చంద్రబాబు అంటే ఎవరికైనా వెంటనే తట్టేది ఏంటి అంటే ఆయన విజనరీ అని. డెవలప్మెంట్ చేస్తారని. అలాగే మంచి అడ్మినిస్ట్రేటర్ అని. ఆ ఇమేజ్ నే బాబుకు ఎంతో మందిని ఫ్యాన్స్ గా చేసింది. అయితే బాబు నాలుగవ సారి సీఎం అయ్యాక పాత ఇమేజ్ ని కంటిన్యూ చేయలేకపోతున్నారు అన్న ప్రచారం సాగుతోంది.

అదే టైం లో బాబు ఎన్నడూ చేయని రివెంజ్ పాలిటిక్స్ ని ఎంచుకున్నారు అంటున్నారు అయిదేళ్ల పాటు వైసీపీ టీడీపీకి చుక్కలు చూపించింది. దాంతో టీడీపీ క్యాడర్ నుంచి లీడర్ వరకూ అంతా రగిలిపోయి ఉన్నారు. అధికారం అలా ఇలా వచ్చి పడలేదు, అద్భుతమైన మెజారిటీతో టీడీపీ కూటమి కట్టి గెలిచింది.

దాంతో ఇదే చాన్స్ వైసీపీని ఏమీ కాకుండా చేయాలన్నది టీడీపీ నుంచి వచ్చిన ఒత్తిడి. దాంతో ఆ విషయంలో బాబు కూడా అలాగే వెళ్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. చంద్రబాబు అధికారంలోకి 2014లోనూ వచ్చారు. కానీ అప్పట్లో ఇపుడున్నంత రివెంజ్ పాలిటిక్స్ లేదు.

బాబు వైసీపీని చూసీ చూడనట్లుగా పోయారు. ఏమి చేసినా చివరి రెండేళ్ళలో జరిగింది. అది కూడా ఫిరాయింపుల దగ్గరే ఆగింది. ఇక జగన్ సుదీర్ఘ పాదయాత్రకు అయినా లేదా ఆయన విపక్ష నేతగా ఏపీలో ఎక్కడికి వెళ్ళినా టీడీపీ సర్కార్ ఫుల్ ఫ్రీడం ఇచ్చింది. ఏ రకమైన కండిషన్లూ పెట్టలేదు

చిత్రమేంటి అంటే 2014 నుంచి 2019 టీడీపీ టెర్మ్ లో జగన్ తిరుమలకు కూడా చాలా సార్లు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. కానీ డిక్లరేషన్ ఇవ్వలంటూ యాగీ చేయలేదు. అలా స్మూత్ గానే పాలిటిక్స్ నడిపారు. అలాంటి బాబు లో ఇపుడు చూస్తే ఈ మార్పు ఏంటి అన్న చర్చ సాగుతోంది.

జగన్ తొలిసారి స్వామిని దర్శించుకోవడం లేదు. దాంతో ఆయన తిరుమల టూర్ ని వదిలేస్తే పోలా అన్న మాట కూడా వినిపించింది. అదే విధంగా చూస్తే టీడీపీ కూటమి వంద రోజుల పాలనలో అన్ని వైపులా జగన్ నామ స్మరణతోనే గడిపారు. ఏమి జరిగినా కారకుడు జగనే అంటూ వచ్చారు. ఆఖరుకు అప్పు పుట్టకపోయినా జగనే అని చంద్రబాబు అంటున్నారు.

ఈ వైఖరి నిజంగా జగన్ నుంచి ఆయన పుచ్చుకున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. జగన్ కి చంద్రబాబు ఫోబియా ఉందని అంటూంటారు. ఎవరో ఎందుకు చెల్లెమ్మ షర్మిలే ఆరోపిస్తూ వచ్చారు. ఇపుడు చంద్రబాబు కూడా అన్నింటికీ జగన్ పేరుని తలచుకోవడం కూడా చిత్రంగా తోస్తోంది అని అంటున్నారు

లడ్డూ ప్రసాదం ఇష్యూ విషయంలో తప్పు జరిగితే టీటీడీ అధికారుల స్థాయిలో చర్యలు తీసుకుని దానిని అక్కడితో క్లోజ్ చేసి ఉంటే పోయేది. దానిని తెచ్చి వైసీపీ మీదకు రుద్దడం దాంతో పాటు ఆ ఇష్యూలో దూకుడు చేయడంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో మత రాజకీయం మొదలైంది అన్న భావన ఏర్పడింది.

బాబు ఏలుబడిలో ఎపుడూ ఇలాంటివి ఎవరూ చూడలేదని అంటున్నారు. పాతబస్తీ అల్లర్లు కూడా ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండగా బాబు కంట్రోల్ చేసిన హిస్టరీ ఉంది. బాబు ఎపుడూ ఒక్కటే చెబుతూ ఉండేవారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ కాకూడదని శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని. కానీ ఎందుకో ఈ టెర్మ్ లో అలా బాబు పూర్తిగా పట్టు సాధిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది.

ఇక పోతే బాబు 2047 స్వర్ణాంధ్ర అంటూ ఇచ్చిన పిలుని చూసిన వారు పాత బాబు మళ్ళీ వచ్చారు అని అంటున్నారు. బాబు డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలని ఏపీ ఇప్పటికే అన్ని విధాలుగా దెబ్బ తిని ఉందని అందువల్ల దానికి తోడు మత రాజకీయాలు కూడా జత కలిస్తే ఇక కోలుకోలేని దెబ్బ తింటుందని అంటున్నారు. బాబు అభివృద్ధి చేసి చూపిస్తే ఆయన చరిత్రలో నిలిచిపోతారని అంటున్నారు.

అమరావతి రాజధానితో పాటు పోలవరం పరిపూర్తి ఈ అయిదేళ్ళలో జరిగేలా బాబు దృఢ సంకల్పంతో వ్యవహరించాలని టీడీపీ క్యాడర్ తో పాటు ఎవరినీ రివేంజ్ పాలిటిక్స్ కి అనుమతించకుండా ఏపీలో తనదైన మార్క్ పాలనను మళ్ళీ చూపించాలని అంతా కోరుకుంటున్నారు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News