తమ్ముళ్ళకు బాబు బిగ్ టాస్క్ !

సార్వత్రిక ఎన్నికలు జరిగి దాదాపుగా పది నెలలకు దగ్గర అవుతోంది. ఇపుడు ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

Update: 2025-02-17 03:37 GMT

సార్వత్రిక ఎన్నికలు జరిగి దాదాపుగా పది నెలలకు దగ్గర అవుతోంది. ఇపుడు ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టీడీపీ కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లలో భారీ విజయం దక్కాలని బాబు ఆకాంక్షిస్తున్నారు.

అంతే కాదు సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన దాని కంటే అదిరిపోయే మెజారిటీలు రావాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. చంద్రబాబు క్రిష్ణా గోదావరి ఎమ్మెల్సీ, అలాగే గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తమ్ముళ్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉన్నది కేవలం పది రోజుల కంటే తక్కువ సమయమే అని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతీ ఎన్నికా ఒక పరీక్ష అని బాబు చెప్పారు. అంతే కాదు తాను మార్కులు వేస్తాను అని అంటున్నారు.

అంతా విభేదాలు మరచి ఒక్కటిగా కష్టపడాలని ఆయన సూచించారు. సమిష్టిగా పనిచేస్తేనే విజయం దక్కుతుందని ఆయన అన్నారు. నేతలకు ఎపుడూ రిలాక్స్ అన్నది ఉండరాదని ఆయన అన్నారు. గ్రౌండ్ లెవెల్ లో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని కోరారు.

ఈ సందర్భంగా బాబు 93 శాతం స్ట్రైకింగ్ రేటు సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిందని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి ఫలితాలే రావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఈ ఫలితాలు తమ్ముళ్ళకు ఒక పరీక్ష అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదు అని ఆయన కోరుతున్నారు.

మరి తమ్ముళ్ళు సార్వత్రిక ఎన్నికల నాటి ఫలితాలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు కో ఆర్డినేషన్ తో పనిచేయాలని ఆయన కోరుతున్నారు. చాలా చోట్ల అయితే తెలియని వర్గ పోరు ఉంది. అలాగే మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కొంత గ్యాప్ ఉంది. మరో వైపు చూస్తే క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య 2024 ఎన్నికల నాటి సఖ్యత కూడా ఎంతవరకూ ఉందో తెలియదు. ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గట్టి పోటీ లేకపోవడం శ్రీరామ రక్ష గానే ఉంది.

అదే సమయంలో వామపక్షాల నుంచి పోటీ కొంత కలవరపెడుతోంది. వామపక్షాలకు సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది. అంతే కాదు వారు అనేక ఎమ్మెల్సీ ఎన్నికలను చూసి ఉన్నారు. దాంతో వారితో ఈ పోటీ అంటే బయటకు తెలియని సమరమే అని అంటున్నారు.

Tags:    

Similar News