అదానీతో ఒప్పందాల మీద చంద్రబాబు సంచలన నిర్ణయం ?

అయితే ఈ విషయంలో చంద్రబాబు మాత్రం గత సర్కార్ అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలు అన్నీ రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

Update: 2024-11-26 15:30 GMT

ఏపీలో ఏడు వేల కోట్ల రూపాయలతో సౌర విద్యుత్ సరఫరాకు సంబంధించి దిగ్గజ పారిశ్రామిక వేత్త అదానీతో నాటి వైసీపీ ప్రభ్తువం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందా అంటే పరిణామాలు అలాగే ఉన్నాయని అంటున్నారు.

ఎందుకంటే ఈ ఇష్యూ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చకు దారి తీస్తొంది. గౌతం అదానీ మీద అమెరికా స్థాయిలో కేసు నమోదు కావడం అందులో ఏపీలో నాటి సర్కార్ కి ముడుపులు ఇచ్చారన్న ప్రస్తావన ఉండడంతో కచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.

అంతే కాదు కాంగ్రెస్ వామపక్షాలు కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల అయితే ముడుపుల భాగవతం మీద పూర్తి విచారణ జరిపించాలని సీబీఐ ద్వారానే చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ రామక్రిష్ణ సీపీఎం నుచ్ని పొలిట్ బ్యూరో మెంబర్ రాఘవులు కూడా ఇదే అంశం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ విషయంలో నాటి సీఎం జగన్ మీద కేసు పెట్టాలన్నా కూడా ముందుగా ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు మాత్రం గత సర్కార్ అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలు అన్నీ రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

ఇక అదానీ విషయంలో బీజేపీ పెద్దల మనసులో ఏమి ఉంది అన్న దానిని ఆరా తీసే పనిలో కూటమి పెద్దలు ఇపుడు ఉన్నారని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీతోనూ భేటీ అవుతారు అని అంటున్నారు ఆ సమావేశం తరువాత ఏమైనా క్లారిటీ రావచ్చు అని అంటున్నారు. కేంద్ర పెద్దల మదిలో ఏముందో అన్నది చూసుకున్న మీదట కూటమి ప్రభుత్వం ఈ విషయంలో దూకుడుగా అడుగులు వేస్తుందని అంటున్నారు.

ఇక ఒక్కసారి కనుక ఒప్పందం రద్దు అయితే ఆ మీదట రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతాయని అంటున్నారు. అవి అంతిమంగా విపక్ష నేత మాజీ సీఎం జగన్ అరెస్ట్ దాకా వెళ్తాయా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అదానీతో ఒప్పందాల విషయంలో కూటమి ప్రభుత్వం ఏమి చేయాలో అంతా కలసి చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. మొత్తానికి ఒకటి రెండు రోజులలో ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకునే చాన్స్ అయితే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News