ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలాంటి పుస్త‌కాల పురుగో చూశారా?

ప‌వ‌న్ ఓ లైబ్ర‌రీలో ఉన్నారా లేదా బుక్ స్టోర్ లో ఉన్నారా? అనేది ప‌రిశీలిస్తే.. ప‌వ‌న్ దిల్లీలోని ఒక పుస్త‌క సెంట‌ర్ లో ఉన్నార‌ని క్లారిటీ వ‌చ్చింది.

Update: 2024-11-26 12:28 GMT

పుస్త‌కాలు చ‌ద‌వ‌డం అనేది నేటి జ‌న‌రేష‌న్ కి క‌ష్ట‌మైన ప్ర‌క్రియ‌గా మారింది. సాహితీ ప్ర‌క్రియ‌ల గురించి ఇప్ప‌టి త‌రానికి సున్నా నాలెజ్. నేటి అల్ట్రా స్పీడ్ విజువ‌ల్ మాధ్య‌మ యుగంలో ఒక‌ప్ప‌టిలా పుస్త‌కాల పురుగులు త‌క్కువ‌. యూట్యూబ్ డిజిట‌ల్ మీడియా యుగంలో పుస్త‌కాలు చ‌దివేవారి సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.

 

అయితే ఎయిటీస్ అంత‌కుముందు జ‌న‌రేష‌న్ లో పుస్త‌కాల పురుగులు ఉన్నారు. అలాంటి జాబితాలో గురూజీ త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి వారు సుప్ర‌సిద్ధులు. నాయ‌కుడు, న‌టుడు అయిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరిక స‌మ‌యంలో పుస్త‌కాలు చ‌దివేందుకు ఆస‌క్తిగా ఉంటారు. విజ్ఞాన వినోదాత్మ‌క పుస్త‌కాల‌ను ఎక్కువ‌గా చ‌దువుతుంటారు. ఆయ‌న జిజ్ఞాస‌కు సంబంధించిన ఓ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

 

ప‌వ‌న్ ఓ లైబ్ర‌రీలో ఉన్నారా లేదా బుక్ స్టోర్ లో ఉన్నారా? అనేది ప‌రిశీలిస్తే.. ప‌వ‌న్ దిల్లీలోని ఒక పుస్త‌క సెంట‌ర్ లో ఉన్నార‌ని క్లారిటీ వ‌చ్చింది. ఆయ‌న దిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కన్నాట్ ప్లేస్‌లోని ఐకానిక్ ఆక్స్‌ఫర్డ్ బుక్‌స్టోర్‌ను న్యూఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లోని ఫకీర్‌చంద్ బుక్‌స్టోర్‌ను సందర్శించారు. దిల్లీలో ప‌లువురు నాయ‌కుల‌ను క‌లిసి ఏపీ వృద్ధి గురించి పాల‌సీల గురించి మాట్లాడిన ప‌వ‌న్ ఇలా తీరిక స‌మ‌యం చిక్క‌గానే పుస్త‌కాలు కొనేందుకు బ‌య‌ల్దేరారు. సాహిత్యం, వైజ్ఞాన‌దాయ‌క పుస్త‌కాల‌ను కొనుగోలు చేసార‌ని అత‌డి చేతిలో ఉన్న పుస్త‌కాలు చెబుతున్నాయి. సాంస్కృతిక సాహిత్య సంపదను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామ‌ని, సాహితీ ప‌రిభాష‌ను కాపాడ‌తామ‌ని ప‌వ‌న్ వంటి వారు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున‌నారు. భ‌విష్య‌త్ త‌రాల‌ను కాపాడే ప్ర‌క్రియ ఇద‌ని ప‌వ‌న్ చెబుతున్నారు.

 

ఆసక్తికరంగా పవన్ షేర్ చేసిన ఫోటోల‌ను బ‌ట్టి పుస్తకాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. నీల్ గార్మోన్స్ నార్స్ మైథాలజీ, ప్లూటోస్ ది రిపబ్లిక్ అండ్ ప్రిమిటివ్ క్యాంపింగ్, బుష్‌క్రాఫ్ట్ (స్పీర్ అవుట్‌డోర్స్): క్యాంపింగ్ .. అవుట్‌డోర్‌లలో జీవించడానికి దశలవారీ గైడ్.. వంటివి ఉన్నాయి.

Tags:    

Similar News