రాజ్యసభకు నాగబాబు ఫిక్స్!

ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యస్భ సీట్లకు ఉప ఎన్నికలు డిసెంబర్ లో జరగనున్నాయి.

Update: 2024-11-26 13:30 GMT

ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యస్భ సీట్లకు ఉప ఎన్నికలు డిసెంబర్ లో జరగనున్నాయి. దీంతో ఏపీలో పెద్దల సభకు సంబంధించిన రాజకీయ హడావుడి మొదలైంది. వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు వైసీపీ నుంచి రాజ్యసభకు రాజీనామా చేసారు. వారిలో బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్ క్రిష్ణయ్య రాజీనామాలు చేయడంతోనే ఈ ఉప ఎన్నికలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే అనకాపల్లి లోక్ సభకు పోటీ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుని పొత్తులో భాగంగా చివరి నిముషంలో తప్పుకున్న నాగబాబుకు దానికి ఫలితంగా ఇపుడు రాజ్యసభ సీటు దక్కనుంది అని అంటున్నారు. మొత్తం మూడు సీట్లలో ఒకటి జనసేనకు దక్కనుంది అని అంటున్నారు.

ఇక చూస్తే కనుక జనసేన నుంచి కచ్చితంగా నాగబాబుకే ఈ సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది. నాగబాబుని ఢిల్లీ రాజకీయాల్లోకి పంపించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. అది ఇప్పటిది కూడా కాదు 2019లోనే జనసేన నుంచి నర్సాపురం లోక్ సభకు పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా కూడా నాగబాబుకు రెండున్నర లక్షల ఓట్ల దాకా వచ్చాయి.

ఇక ఈసారి కూటమి తరఫున పోటీ చేసి ఉంటే ఆయన అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యేవారని అంతా చెబుతారు. అది కూడా బీజేపీ పొత్తు కారణంగా నాగబాబు వదులుకోవాల్సి వచ్చింది. దాంతో ఇపుడు రాజ్యసభ ఉప ఎన్నికలు అనుకోని అవకాశంగా వచ్చాయి. నిజం చెప్పాలీ అంటే వైసీపీకి ఏపీలో మొత్తం 11 ఎంపీ సీట్లు రాజ్యసభలో ఉన్నాయి.

మరో రెండేళ్లకు కానీ రాజ్యసభ సీట్లు ఖాళీ అవవు. కానీ వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడం, అందులో ఇద్దరు టీడీపీలోకి వెళ్లడంతో కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే రాజ్యసభ పదవులు కూడా కూటమికి దక్కనున్నాయి. ఏపీ అసెంబ్లీలో చూస్తే మొత్తం 164 సీట్లు కూటమికి ఉన్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి ఉన్నారు.

దాంతో వైసీపీ ప్రమేయం లేకుండా మొత్తానికి మొత్తం మూడు సీట్లను కూటమి భారీ ఆధిక్యతతో గెలుచుకునే అవకాశం ఉంది. ఇక చూస్తే డిసెంబర్ 3 నుంచి 10 వరకూ నామినేషన్లు స్వీకరణ ఉంది. పోటీ ఉంటే కనుక అపుడు ఎన్నికలు పెడతారు. కానీ ఏపీలో మూడు సీట్లూ ఏకగ్రీవం అవుతాయని అంటున్నారు. మొత్తానికి నాగబాబు పెద్దల సభలో అడుగు పెట్టడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News