జ‌గ‌న్ చూపిన దారిలో చంద్ర‌న్న ప్ర‌యాణం..!

జగన్ చూపిన దారిలో చంద్రబాబు నడుస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా వినిపిస్తున్న మాట.

Update: 2024-09-01 07:30 GMT

జగన్ చూపిన దారిలో చంద్రబాబు నడుస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా వినిపిస్తున్న మాట. ఇది కొంచెం చిత్రంగా అనిపించి నా లోతుగా ఆలోచిస్తే చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వేస్తున్న అడుగులు వంటివి జగన్ ఏదైతే చేసి ఓడిపోయారో అది తాను చేయకుండా ముందుకు సాగుతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇది కొంచెం చిత్రంగా ఉంటుంది. జగన్ నాణేనికి ఒకవైపే చూశారు. అంటే సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ కేవలం సంక్షేమానికి మాత్రమే అని ప్రాధాన్యం ఇచ్చారు. దీనివల్ల పేదలకు లబ్ధి చేకూర్చిన మాట వాస్తవం.

అప్పటివరకు బ్యాంకుల్లో పెద్దగా డబ్బులు లేని వారికి 2024 సంవత్సరం మార్చి నాటికి చూస్తే 50 వేల నుంచి లక్ష రూపాయలు మధ్య పేదల బ్యాంకు అకౌంట్లో డబ్బులు నిల్వ ఉన్నాయి. ఈ విష‌యాన్ని ఆర్బిఐ చెప్పింది. ఇది మంచి పరిణామం. అయితే దీనివల్లే రాజకీయాలు చేయొచ్చు దీనివల్ల గెలవచ్చు అనేది మాత్రం జగన్ విషయంలో ఫెయిల్ అయిపోయింది. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో జగన్ ను ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని చెప్పాలి.

అంటే జగన్ వెళ్లిన దారి కేవలం సంక్షేమం అయితే ఆ దారిలో వెళ్తూనే మరోవైపు అభివృద్ధిని కూడా జోడించి ముందుకు తీసుకువెళ్లాలని కాన్సెప్ట్ ను చంద్రబాబు అలవర్చుకున్నారు. అంటే ఓ రకంగా ఏ తప్పులు చేసి జగన్ ఓడిపోయారో ఆ తప్పులు చేయకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది జగన్ చూపించిన దారి. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుంటే ఓడిపోతామనేది ఆయన వెల్లడించిన రాజకీయ పాఠం. దీన్ని చంద్రబాబు బాగానే వంట పట్టించుకుని కేవలం సంక్షేమం కాదు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్లాలని వ్యూహాత్మక ధోరణితో ముందుకు సాగుతున్నారు.

అందుకే సూపర్ సిక్స్ పథకాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 2029 నాటికి అమరావతిని దాదాపు 75% పూర్తి చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టు తొలిదశని కూడా పూర్తి చేయాలని చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం. ఇదే అభివృద్ధిగా 2029 నాటికైనా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మెజారిటీ ప్రజలు దీనిని స్వాగతిస్తారు. అలా కాకుండా జగన్ చేసిన పొరపాటు కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని ఒక వర్గాన్ని మాత్రమే నెత్తిన‌ పెట్టుకోవడం వల్ల మైనస్ అయ్యారు. ఈ దారిలోనే ఇప్పుడు చంద్రబాబు నడుస్తూ ఆయన చేసిన తప్పులు చేయకుండా ముందుకు సాగుతున్నారని చెప్పాలి.

Tags:    

Similar News