చంద్రబాబు అరెస్ట్... పదివేల శాంపిల్స్ తో రిజల్ట్ ఇదే....!

ఏపీ రాజకీయం ఎలా సాగుతోంది అన్న దాని మీద ఒక ప్రముఖ సర్వే అయితే లేటెస్ట్ గా ఏపీలో రాజకీయాల మీద గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ని బయట పెట్టింది అని అంటున్నారు.

Update: 2023-09-23 12:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీలో పెద్ద ఎత్తున సానుభూతి వెల్లువెత్తుతోందని అంతా అనుకున్నారు. అలా జరిగింది అని ఒక వైపు టీడీపీ అనుకూల మీడియా తెగ ఊదరగొడుతోంది. మరో వైపు చూస్తే రకరకాలైన సర్వేలు కూడా వెలువడుతున్నాయి. బాబు గారికి విపరీతమైన సింపతీ కురిసింది అని అంటున్నారు.

ఇందులో జాతీయ సర్వేలతో పాటు లోకల్ సర్వేలు కూడా ఉన్నయి. ఎవరికి తోచిన తీరున వారు సర్వే నివేదికలు ఇస్తున్నారు. ఇటీవల సీ ఓటర్ సర్వే నివేదిక కూడా బయటకు వచ్చింది. అందులో చూసుకుంటే అన్ని పార్టీల నుంచి కూడా బాబు అరెస్ట్ మీద సానుభూతి కురిసింది అని చెప్పుకొచ్చారు.

అంతే కాదు ఏపీలో పెద్ద ఎత్తున బాబు అరెస్ట్ మీద జనాలు సింపతీ చూపిస్తున్నారు అని కూడా పేర్కొంటున్నారు. అయితే ఈ సర్వే శాంపిల్స్ చూస్తే కేవలం వందలలో మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ సర్వే కరెక్ట్ గా వచ్చిందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక తెలుగుదేశం సొంతంగా సర్వేలు చేయిస్తోంది. అందులో సహజంగా సానుభూతి వెల్లువ అయిపోతోంది.

వైసీపీ వారి సర్వేలు ఎటూ దానికి భిన్నంగా వస్తాయి. వారు ఎంతసేపూ సంక్షేమ పధకాల మీదనే ప్రశ్నలు వేస్తూంటారు. దాంతో అసలు విషయం పక్కకు పోతుంది. కాబట్టి ఆ సర్వేలు కూడా క్లియర్ కట్ గా చెప్పలేవు అంటున్నారు.

ఇక ఇవన్నీ ఇలా ఉంటే అసలు బాబు అరెస్ట్ తరువాత ప్రజల మనోభావాలు ఏమిటి ఎలా ఉన్నాయి. ఏపీ రాజకీయం ఎలా సాగుతోంది అన్న దాని మీద ఒక ప్రముఖ సర్వే అయితే లేటెస్ట్ గా ఏపీలో రాజకీయాల మీద గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ని బయట పెట్టింది అని అంటున్నారు. ఏకంగా పదివేల శాంపిల్స్ తో ఈ సర్వే సాగడం ఒక ఎత్తు అయితే అన్ని నియోజకవర్గాలలో అన్ని వయసుల వారితో ఈ సర్వేను తీసుకోవడం జరిగింది అని అంటున్నారు.

ఈ సర్వే ప్రకారం చూసుకుంటే ఉద్యోగులు ఉన్నారు, చదువరులు ఉన్నారు. రైతులు ఉన్నారు, గ్రామీణులు ఉన్నారు, ఇలా వివిధ కేటగిరీలకు చెందిన వారిని అందరినీ సర్వే పేరిట అభిప్రాయ సేకరణ చేసింది. ఈ సర్వే ఫలితాలు అయితే ఆశ్చర్యకరంగా ఉన్నాయని అంటున్నారు.

ఈ సర్వే మేరకు చూసుకుంటే రాయలసీమలోని నాలుగు జిల్లాలలో పెద్దగా సానుభూతి అయితే ఏమీ లేదు అని అంటున్నారు. నిజంగా బాబు ఈ నెల 9న అరెస్ట్ అయింది రాయలసీమలోని నంద్యాలలో, అంతే కాదు అప్పటికి ఆయన కొద్ది రోజులుగా రాయలసీమలో పర్యటన చేస్తున్నారు. మరి బాబు అరెస్ట్ అయిన చోటనే సానుభూతి అయితే పెద్దగా లేదని అంటున్నారు.

మరో వైపు చూస్తే ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా అయితే బాబు అరెస్ట్ మీద కొంత సానుభూతి కనిపిస్తోంది అని అంటున్నారు. అంటే ఉమ్మడి పదమూడు జిల్లాలలో నాలుగు రాయలసీమ జిల్లాలను పక్కన పెడితే మిగిలిన తొమ్మిది జిల్లాలలోనే కొంత దాకా సానుభూతి కనిపిస్తోంది అంటున్నారు. అది కూడా వెల్లువలా ఏమీ లేదు అని ఈ సర్వే చెబుతోంది అంటున్నారు.

ఇక ఓవరాల్ గా సర్వే నివేదికను చూసుకుంటే కనుక చంద్రబాబు అరెస్ట్ అక్రమమా అని స్ట్రైట్ గా ప్రశ్న వేస్తే అవును అని జవాబు చెప్పిన వారు 29 శాతంగానే ఉన్నారు అంటున్నారు. అంటే 71 శాతం మంది భిన్నాభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. అంటే 29 శాతంలో మాత్రమే సానుభూతి వచ్చింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే చంద్రబాబు అవినీతి చేశారా అన్న స్ట్రైట్ ప్రశ్నకు 36 శాతం మంది మాత్రమే చేశారు అని నమ్ముతున్నారుట. మిగిలిన 35 శాతం మంది మాకు తెలియదు అని న్యూట్రల్ గా జవాబు చెబుతున్నారు అని అంటున్నారు. ఇలా బాబు అరెస్ట్ మీద అయితే సింపతీ అన్నది వర్కౌట్ అయ్యేలా లేదు అన్నది ఈ సర్వే తేల్చిన సారాంశం అంటున్నారు.

కొంతవరకూ మాత్రమే సానుభూతి లభించింది అదే విధంగా చూస్తే మిశ్రమ స్పందన కూడా జనంలో కనిపిస్తోంది అంటున్నారు. మొత్తానికి బాబు అరెస్ట్ తరువాత సానుభూతి వెల్లువెత్తి వైసీపీ ప్రభుత్వం అందులో కొట్టుకుని పోతుందని, రాజకీయ సమాధి అవుతుంది అని టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు ఈ సర్వేలోని విషయం భిన్నంగానే ఉంది అంటున్నారు.

Tags:    

Similar News