చంద్రబాబు పవర్ ఫుల్... రేవంత్ కు హరీష్ రిక్వస్ట్!

ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కీలక స్టెప్ తీసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-07-03 01:30 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పునర్వ్యవస్థీకరణ చట్టం వల్ల తలెత్తిన అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాని సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కీలక స్టెప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ కు కీలక సూచనలు చేశారు.

అవును... విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ సమస్యలపై చర్చించేందుకు జూలై 6న సమావేశం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

విభజన జరిగి సుమారు 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కాకుండా మగ్గుతున్నాయని.. రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, అభివృద్ధిపై ఈ సమస్యలు ప్రభావం చూపుతున్నాయని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ముఖాముఖి సమావేశం వల్ల సామరస్యపూర్వక తీర్మానం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే... దీనిపై తెలంగాణ సీఎంవో నుంచి రియాక్షన్ రావాల్సి ఉంది!

ఈ సమయంలో బీఆరెస్స్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇందులో భాగంగా... రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు చంద్రబాబు అధికారికంగా రేవంత్ ను సంప్రదించడం శుభపరిణామని అన్నారు! ఈ సందర్భంగా ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తిరిగి తీసుకురావాలని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలని అన్నారు.

విభజన అనంతరం బీజేపీ మద్దతుతోనే చంద్రబాబు ఈ ఏడు మండలాలూ ఏపీకి బదలాయిస్తూ పొందుపరిచిన బిల్లును ఆమొదించారని చెప్పిన హరీష్... ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించారని అన్నారు. ఈ నేపథ్యంలో... ఆ ఏడు మండలాలనూ, దిగువ సీలేరు ప్రాజెక్టును తెలంగాణకు తిరిగి ఇచ్చేలా చూడాలని రేవంత్ ను హరీష్ కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... చంద్రబాబు ఇప్పుడు అత్యంత శక్తివంతంగా ఉన్నారని చెప్పిన హరీష్ రావు... ఆయన చేతిలో బీజేపీ, ఎన్డీయే సర్కార్ ఉన్నాయని అన్నారు. ఈ సమయంలో ఈ ఏడు మండలాల విషయంలో చంద్రబాబు ఒప్పించాలని రేవంత్ రెడ్డిని కోరారు. దీంతో... వీటిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News