టీడీపీకి స్పీకర్ తో పాటు ఆరు కీలక మంత్రిత్వ శాఖలు...!?

ఎందుకంటే బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా సంఖ్యా బలం అయితే లేదు ఆ పార్టీ 240 నంబర్ దగ్గర ఆగిపోయింది.

Update: 2024-06-05 17:22 GMT

ఢిల్లీలో చంద్రబాబు డిమాండ్ మామూలుగా లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ కనుక లేకపోతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఏర్పడదు. ఇదే నిజం. ఎందుకంటే బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా సంఖ్యా బలం అయితే లేదు ఆ పార్టీ 240 నంబర్ దగ్గర ఆగిపోయింది.

దాంతో మ్యాజిక్ అయిన 272కి చేరుకోవాలంటే చంద్రబాబు టీడీపీ చాలా అవసరం. దాంతో ఇపుడు బీజేపీ వద్ద బాబు అతి పెద్ద డిమాండ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీ టీడీపీ. పదహారు మంది ఎంపీలు ఉన్నారు. దాంతో పాటు జనసేనకు ఇద్దరు ఉన్నారు. అలా 18 మంది ఎంపీల బలం బాబు వైపు ఉంది.

దాంతో ఆయన గిరాకీ హై లెవెల్ లో ఉంది అని అంటున్నారు. ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి వెళ్ళిన చంద్రబాబు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్గ కూర్పు మీద ఢిల్లీ పెద్దలతో చర్చించారు. అయితే ఈసారి టీడీపీ పంట బాగా పండుతోంది అని అంటున్నారు. ఈసారి కేంద్రంలో కీలకమైన ఆరు శాఖలు దక్కేలా టీడీపీ పట్టుపడుతోంది అని అంటున్నారు.

ఆ శాఖలు ఏంటి అంటే జలశక్తి వనరుల శాఖ, అలాగే రూరల్ డెవలప్మెంట్, ట్రాన్స్ పోర్టు, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఆర్ధిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పదవి కూడా బాబు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా స్పీకర్ పోస్ట్ కూడా టీడీపీకి ఇవ్వాలని బాబు డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. స్పీకర్ పోస్ట్ టీడీపీ వాజ్ పేయి టైం లో తీసుకుంది. బాలయోగికి ఆ పదవిని అప్పగించింది. ఆ విధంగా మరోసారి స్పీకర్ పోస్ట్ తమకు కావాలని బాబు బీజేపీ పెద్దలను కోరారని అంటున్నారు

ఇక ఢిల్లీ స్థాయిలో చూస్తే బీజేపీకి బాబు అడిగిన కేంద్ర మంత్రి పదవులు ఇవ్వక తప్పేట్లు లేని వాతావరణం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే బీజేపీకి టీడీపీ మద్దతు ప్రాణ సమానం. ఒక విధంగా చెప్పాలంటే మోడీ సర్కార్ కి ఆక్సిజన్. అందువల్ల ఆరు కీలక శాఖలు టీడీపీకి ఇవ్వవచ్చు అని అంటున్నారు.

అదే కనుక జరిగితే కేంద్ర మంత్రివర్గంలో ఏపీ పాత్ర చాలా కీలకంగా మారుతుంది. దాంతో పాటు అభివృద్ధి కూడా అద్బుతంగా సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బాబు అడిగిన జలశక్తి వనరుల శాఖ ఇస్తే పోలవరం ప్రాజెక్ట్ ఒక్క ఏడాదిలోనే పూర్తి అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయం రూరల్ డెవలప్మెంట్, ఐటీ వంటి సాఖలతో విభజన ఏపీకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆర్హ్దిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చినా నిధుల విషయంలో ఏపీకి ఉదారంగా తెచ్చుకునే వీలు ఉంటుంది.

మొత్తానికి బాబు చాణక్య రాజకీయంతోనే బీజేపీ పెద్దల వద్ద మంచి డిమాండ్ పెట్టారని అంటున్నారు. పదేళ్ళుగా అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి ఇది ఒక విధంగా సువర్ణ అవకాశం అని అంటున్నారు. సో ఢిల్లీలో కేంద్రంలో ఇపుడు బాబు రాజకీయ బాహుబలి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Tags:    

Similar News