తుఫాను కారణంగా అదుపుతప్పిన ఇండిగో విమానం.. వీడియో వైరల్!

ఇటీవల వారల్లోకి వస్తోన్న విమానాలకు సంబంధించిన వార్తలు ప్రయాణికులను తెగ టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-01 07:06 GMT

ఇటీవల వారల్లోకి వస్తోన్న విమానాలకు సంబంధించిన వార్తలు ప్రయాణికులను తెగ టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా భారీ వర్షాలు పడినప్పుడు రన్ వేలపై ల్యాండింగ్ సమస్య కు సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో 'ఫెయింజల్' కారణంగా ఇండిగో విమానం అదుపుతప్పిన ఘటన తెరపైకి వచ్చింది.

అవును... బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను పలు ప్రాంతాలను జలమయం చేసింది. ఈ క్రమంలోనూ దీని ప్రభావం ఏపీలో కనిపించినప్పటికీ.. తమిళనాడులో దీని తీవ్రత ఎక్కువగా ఉందని అంటున్నారు. చాలా ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తిన పరిస్థితి. ఈ సమయంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లోనూ నీరు చేరింది.

దీంతో... విమానాలు దిగేందుకు, ఎగిరేందుకూ తీవ్ర ఇబ్బందులు పడ్డాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటలు విమానాశ్రయాలను మూసేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ సమయలోనే చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇందులో భాగంగా... ఇండిగో ఎయిర్ లైన్స్ ఎయిర్ బస్ విమానం చెన్నై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. అయితే.. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో... మరుక్షణంలొనే తిరిగి గాల్లోకి ఎగిరింది.

కాగా... బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని తాకింది. ఫలితంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 90 కి.మీ. వేగంలో గాలులు వీస్తున్నాయి. అయితే ఆదివారం ఉదయం పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.

Tags:    

Similar News