కింద కూర్చుని భోజనం చేస్తే రూ. 220 జరిమానా!
చైనాలో అన్ని విచిత్రంగా ఉంటాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచే ఉద్దేశంతో వారు తీసుకుంటున్న నిర్ణయాలు వింతగా ఉంటున్నాయి.
చైనాలో అన్ని విచిత్రంగా ఉంటాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచే ఉద్దేశంతో వారు తీసుకుంటున్న నిర్ణయాలు వింతగా ఉంటున్నాయి. తాజాగా చైనాలోని ఓ కౌంటీ అధికారులు తీసుకొచ్చిన నిబంధన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వంటి రోగాలకు పుట్టినిల్లు అయిన చైనాలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొత్త కొత్త రోగాలు వస్తూనే ఉంటాయి. దీంతో అధికారులు ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నా రోగాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
సిచువాన్ ప్రావిన్స్ లోని పుగే కౌంటీలో ఇంటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తే జరిమానా విధించేందుకు నిర్ణయించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మీడియా సంస్థ వెల్లడించింది. ఇళ్లల్లో వంటపాత్రలు శుభ్రంగా ఉంచుకోకపోతే 1.4 డాలర్లు (రూ.120), భోజన సమయంలో కింద కూర్చుంటే 2.8 డాలర్లు (రూ.220)గా ఫైన్ విధించనున్నారు. ఈ జరిమానా కేటగిరీలను 14 భాగాలుగా విభజించారు.
అధికారులు తనిఖీల కోసం వచ్చినప్పుడు ఇంట్లో అపరిశుభ్ర వాతావరణం ఉంటే శిక్షార్హులవుతారు. ఇంట్లో సాలె పురుగులు కీటకాలు, దుమ్ము, ధూళి ఉంటే మొదటి సారి పది యునాన్లు జరిమానాగా విధిస్తారు. రెండోసారి తనిఖీల్లో అలాంటి తప్పు చేస్తే జరిమానా రెట్టింపు చేస్తారు. జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ ఆశయంగా చైనా ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది.
దేశంలో అపరిశుభ్ర వాతావరణం వల్ల కుక్కలు, దోమలు విపరీతంగా తిరడం వల్ల రోగాలు వ్యాపిస్తున్నాయి. దీంతోనే డ్రాగన్ ప్రజలను జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది. ఇలాంటి నిబంధనల వల్ల దేశంలో మంచి శుభ్రమైన వాతావరణం నెలకొంటుందని భావిస్తున్నారు. దీని కోసమే ఇలా ఫైన్లు వేస్తున్నామని చెబుతోంది.
చైనా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపించడం సహజమే. వారి తిండి కూడా దారుణంగా ఉంటుంది. అన్ని జంతువులను తింటుంటారు. అది కూడా ఉడకని వాటిని సగం ఉడికించిన వాటినే ఎక్కువగా తింటారు. ఇలా చేయడం వల్లనే అక్కడ రోగాల శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వారు భారీ నష్టమే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన నిబంధనలు వారిని ఏ మేరకు కాపాడతాయో చూడాల్సిందే.