చైనాలో కొత్తవైరస్ పై ప్రయోగాలు... సోకితే ఎనిమిది రోజుల్లోనే...!
ఆ సంగతి అలా ఉంటే... చైనా రాజధాని బీజింగ్ లో తాజాగా ఒక ప్రమాదకరమైన వైరస్ పై ప్రయోగాలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
చైనా, వైరస్... ఈ రెండు పదాలను కలిపి చదివితే ప్రపంచం వణికిపోతుంటుంది! కారణం... కరోనా వైరస్ అనేది అందరికీ తెలిసిన విషయమే! ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని చైనానే సృష్టించిందని, దాన్ని ప్రపంచదేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని భావించిందని రకరకాల విశ్లేషణలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే చైనా మాత్రం ఈ విషయంపై ఎప్పటికప్పుడు దాటవేత దోరణినే అవలంభించగా.. ఇప్పుడిప్పుడు మాత్రం ఆ విశ్లేషణలను మాత్రం కొట్టిపారేస్తూనే ఉంది. ఆ సంగతి అలా ఉంటే... చైనా రాజధాని బీజింగ్ లో తాజాగా ఒక ప్రమాదకరమైన వైరస్ పై ప్రయోగాలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అవును... కరోనా వైరస్ విషాదం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంటే... మరో ఆందోళనకర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్ పై చైనా రాజధాని బీజింగ్ లో ప్రయోగాలు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పైగా ఈ వైరస్ సోకితే మరణాల రేటు 100 శాతంగా ఉంటుందంట!
అంటే... వైరస్ సోకితే మరణించడం కన్ ఫాం అన్నమాట! రికవరీ అవ్వడాలు, రెండు వారాల పాటు మెడిసిన్స్ వాడుతూ, పలు జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రన్న అవ్వదన్నమాట! దీంతో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వైరస్ పై ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయని చెబుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు.
వెలువడుతున్న వివరాల ప్రకారం... ఎస్.ఏ.ఆర్.ఎస్. - సీఓవీ-2 కు చెందిన జీ.ఎక్స్_పీ2వి అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారట. ఇది 2017లో వెలుగుచూసిన జీఎక్స్ ఉత్పరివర్తనంగా భావిస్తున్నారు. గతంలో దీన్ని మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారని అంటున్నారు. అయితే ఈ జీఎక్స్_పీ2వీ ను శాస్త్రవేత్తలు తాజాగా ఎలుకలపై ప్రయోగించారని చెబుతున్నారు!
అలా ప్రయోగించిన ఎనిమిది రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని తెలుస్తుంది. ఈ వైరస్ సోకగానే... ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, మెదడు దెబ్బతిన్నాయని.. ఇదే సమయంలో బరువు తగ్గి బలహీనంగా మారాయని, కొన్ని రోజుల్లోనే కనీసం నడవలేని స్థితికి చేరి మరణించాయని చెబుతున్నారు. దీంతో... ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని అంటున్నారు.
ఇలా ప్రస్తుతానికి ఎలుకలపై ఈస్థాయిలో తీవ్ర ప్రభావం చూపిన ఈ సరికొత్త వెర్షన్... మనుషులపై కూడా దాదాపు అటువంటి ప్రభావాన్నే చూపించొచ్చని అంటున్నారు. దీంతో ఈ కొత్త ప్రయోగాలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది!