హిందువులపై హింస... బంగ్లాదేశ్ కు గతం గుర్తుచేసిన పవన్!

బంగ్లాదేశ్ లో హిందూ నేత, హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్నదాస్ బ్రహ్మచారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-27 05:30 GMT

బంగ్లాదేశ్ లో హిందూ నేత, హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్నదాస్ బ్రహ్మచారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటు భారత్ లోనూ, అటు బంగ్లాదేశ్ లోని హిందూ సమాజంలోనూ తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత సంచలనంగా మారిన ఈ వ్యవహరంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ స్పందించారు.

అవును... బంగ్లాదేశ్ లో చిన్మోయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ దేశంలోని హిందువులకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయనను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మరోపక్క ఆయనకు అక్కడి కోర్టులో బెయిల్ దక్కలేదు. దీంతో.. ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఈ సమయంలో చిన్మోయ్ కృష్ణదాస్ పై దేశద్రోహం కేసును మోపింది మహ్మద్ యూనస్ ప్రభుత్వం. ఇదే సమయంలో.. చిన్మయ్ కు మద్దతుగా కోర్టు వద్దకు చేరుకున్న హిందువులపై అక్కడి పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.

ఇందులో భాగంగా... ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి "చిన్మోయ్ కృష్ణదాస్" ను ఆ దేశ పోలీసులు నిర్భందించడాన్ని ఖండిస్తూ అందరం కలిసికట్టుగా పోరాడదామని పవన్ పిలుపునిచ్చారు. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా... బంగ్లాదేశ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని.. మన వనరులు ఖర్చయ్యాయని.. మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని.. మా హిందూ సొదరులు, సోదరీమణులను లక్ష్యంగా చేసుకున్న తీరు మమ్మల్ని తీవ్రంగా కలిచేస్తోందని పవన్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే... చిన్మోయ్ కృష్ణదాస్ తరుపున వాదిస్తున్న ముస్లిం అయిన లాయర్ చిట్టోగ్రామ్ కోర్టు వెలుపల జరిగిన పోలీస్ హింసలో మరణించారు. దీనిపై భారత్ స్పందిస్తూ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న హిందూ మైనారిటీలపై ఈ తరహా దాడులు సరికావని తెలిపింది.

Tags:    

Similar News