చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం... అసలేం జరిగింది?
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగిందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊహించని షాక్ తగిలిందని అంటున్నారు. ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో.. స్థానికంగా ఈ విషయం వైరల్ గా మారింది. నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. చింతమనేనిపై ఎవరు దాడి చేశారు.. ఎందుకు చేశారనేది తెలియాల్సి ఉంది.
అవును... టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగిందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. పక్కా పథకం ప్రకారం చింతమనేనితో వాగ్వాదం పెట్టుకున్నారని.. ఈ సమయంలో అవతలి వ్యక్తులు ఐరన్ రాడ్ తో చింతమనేని సహా ఆయన డ్రైవర్, గన్ మెన్ పైనా దాడి చేశారని అంటున్నారు. ఈ సమయంలో గన్ మెన్ అప్రమత్తమయ్యారని చెబుతున్నారు.
ఈ ఘటనలో సుమారూ పాతిక మంది వరకూ వైసీపీకి సంబంధించిన వ్యక్తులు పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే... ఈ దాడిలో చింతమనేని తృటిలో తప్పించుకున్నట్లు చెబుతున్నారు. బుధవారం రాత్రి వట్లూరులో ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తున్న చింతమనేని... అక్కడ అబ్బయ్య చౌదరి డ్రైవర్ ను బూతులు తిట్టిన సంగతి తెలిసిందే!
అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ అని తెలిసి చెలరేగిపోయాడని, ఆ వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో మరింత దారుణంగా తిట్టారని వైసీపీ ఆరోపిస్తోంది! ఈ నేపథ్యంలోనే చింతమనేని ప్రభాకర్ ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేశారనే ప్రచారం బలంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.