చిన్న సిటీస్ లో ఇళ్ల అమ్మకాల జోరు.. విశాఖలో మాత్రం రివర్సు

దేశీయంగా టైర్ టూ సిటీస్ లో ఇళ్ల అమ్మకాలకు సంబంధించి ఒక ఆసక్తికర రిపోర్టు వెల్లడైంది.

Update: 2025-02-13 09:30 GMT

దేశీయంగా టైర్ టూ సిటీస్ లో ఇళ్ల అమ్మకాలకు సంబంధించి ఒక ఆసక్తికర రిపోర్టు వెల్లడైంది. దీని ప్రకారం దేశంలోని 15 ద్వితీయ శ్రేణి నగరాల్లో గత ఏడాదిలో ఇళ్ల అమ్మకాలు నాలుగు శాతం పెరిగినట్లుగా ప్రాప్ ఈక్విటీ పేర్కొంది. టైర్ టూ సిటీస్ గా కోయంబత్తూర్.. భువనేశ్వర్.. విశాఖపట్నం.. నాసిక్.. వడోదర.. జైపూర్.. భోపాల్.. గోవా.. గాంధీనగర్ తదితర నగరాల్ని పేర్కొంటున్నారు.

టూ టైర్ సిటీస్ లో అమ్ముడైన ఇళ్లకు సంబంధించి 2023లో 1,71,903 అమ్ముడు కాగా.. 2024లో ఈ సంఖ్య 1,78,771కు పెరగటం విశేషం. ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్న ద్వితీయ శ్రేణి నగరాల్లో కోయంబత్తూర్.. భువనేశ్వర్ లో ముందు ఉన్నట్లుగా వెల్లడించింది. అదే సమయంలో ఏపీలోని ఉక్కు నగరంగా పేర్కొనే విశాఖపట్నంతో పాటు.. నాసిక్.. వడోదరలో మాత్రం ఇళ్ల అమ్మకాలు తగ్గాయి.

విశాఖపట్నానికి వచ్చేసరికి 2023లో 5361 ఇళ్లు అమ్ముడైతే.. 2024లో మాత్రం ఈ సంఖ్య 4258కు పరిమితమైనట్లుగా వెల్లడించింది. ఇళ్ల అమ్మకాల విలువ ప్రకారం చూసినప్పుడు ఈ పదిహేను ద్వితీయశ్రేణి నగరాల్లో వ్రద్ధి 20శాతంగా పేర్కొంటున్నారు. 2023లో ఈ నగరాల్లోని ఇళ్ల అమ్మకాల విలువ రూ.1.27 లక్షల కోట్లు కాగా.. 2024లో రూ.1.52 లక్షల కోట్లుగా వెల్లడించారు.

విలువ పరంగా చూస్తే.. ధరలు బాగా పెరిగిన టూటైర్ నగరాలుగా భువనేశ్వర్.. కోయంబత్తూర్.. జైపూర్.. భోపాల్.. గోవా.. గాంధీనగర్ లుగా పేర్కొన్నారు. విశాఖపట్నంలో 2023తో పోలిస్తే 2024లో ఒక శాతం ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లుగా గుర్తించారు. ఎందుకిలా? అంటే.. రాజకీయ కారణాలుగా చెబుతున్నారు. అయితే.. ఈ రిపోర్టులో మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించలేదు.

Tags:    

Similar News