చీరాల రాజెవరు? పొలిటికల్ హీట్ పెరిగిపోయిందే!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో ఈ దఫా ఎన్నికల పోరు మామూలుగా ఉండేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో ఈ దఫా ఎన్నికల పోరు మామూలుగా ఉండేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. గతానికి భిన్నంగా ఇక్కడ రాజకీయాలు తెరమీదికి రావడం.. నాయకులు మారడంతో పోరు తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ ఇక్కడి టికెట్‌ను జనసేనకు త్యాగం చేసిందన్న వార్తల నేపథ్యంలో చీరాలపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
ఇక, వైసీపీ కూడా యువ నాయకుడికి టికెట్ ఇవ్వడం ఖాయమైందని అంటున్నారు. దీంతో ప్రకాశం జిల్లా లో చీరాల నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జనసేనలో చేరిన ఆమంచి స్వాములుకు ఈ టికెట్ కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన ఇక్కడ మాస్ నాయకుడిగా రంగంలోకి దిగుతున్నారు. ఇదే ఆయన తొలిసారి రంగంలోకి దిగుతున్న స్థానం కావడంతో మాస్ జనాలు ఆయనకే జై కొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
పైగా.. ఆర్థికంగానూ స్వాములుకు సాయం చేసేందుకు పలు వర్గాలు రెడీగా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు వైసీపీ ఈ సీటును వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇది మంచి చాన్స్‌గా భావిస్తున్నారు. దీంతో ఇక్కడి రాజకీయ వేడి మరింత పెరిగింది. అటు స్వాములు, ఇటు బాలినేనిల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందనే ప్రచారం ఉంది.
అయితే..ఈ టికెట్‌పై బాలినేని అంతగా ఉత్సాహం చూపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక్కడి వైసీపీ కార్యకర్తలు.. ఆయనకు డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఇక, స్వాములు గెలుపు నల్లేరుపై నడకే అవుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇటు జనసేన, అటు వైసీపీల మధ్యపోరు తీవ్ర స్థాయిలో ఉంటుందని.. బాలినేని ఓకే అంటే.. ఇక , ప్రచారమే తరువాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.