ఒకసారి కంటే ఎక్కువ సార్లు అధికారం ఇవ్వరు
చొప్పదండి నియోజకవర్గ ప్రజలు వినూత్న తీర్పునిస్తుంటారు. ఒకసారి ఎన్నికైన వారికి మరోసారి అవకాశం ఇవ్వలేదు. ఎవరికైనా ఒకసారే అధికారం కట్టబెట్టారు.
చొప్పదండి నియోజకవర్గ ప్రజలు వినూత్న తీర్పునిస్తుంటారు. ఒకసారి ఎన్నికైన వారికి మరోసారి అవకాశం ఇవ్వలేదు. ఎవరికైనా ఒకసారే అధికారం కట్టబెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి సుంకె రవిశంకర్ పై 42 వేల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ మూడో స్థానంలో నిలిచారు.
చొప్పదండి నియోజకవర్గం 1957లో ఆవిర్భవించింది. అప్పుడు సీహెచ్ రాజేశ్వర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985లో న్యాలకొండ రాంకిషన్ రావు 1985లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1994లో రెండుసార్లు విజయం పొందారు. మూడోసారి గెలిచినప్పుడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మూడుసార్లు టీడీపీ నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టారు.
ఇక 1999లో కోడూరి సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 2004లో సాన మారుతి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో సుద్దాల దేవయ్య గెలిచారు. 2014లో బొడిగె శోభ, 2018లో సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేడిపల్లి సత్యం గెలవడం గమనార్హం.
ఒక రాంకిషన్ రావు మూడు సార్లు విజయం సాధించినా ఇంతవరకు ఏ అభ్యర్థి కూడా రెండో సారి విజయం సాధించకపోవడం తెలిసిందే. చొప్పదండి ఓటర్ల తీర్పు వినూత్నంగా ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. ఈనేపథ్యంలో ఇక్కడ రెండు మార్లు గెలిచిన వారు కానరారు. ఇందులో కోడూరి సత్యనారాయణ గౌడ్ మూడోసారి విజయం సాధించగా ఇప్పుడు మేడిపల్లి సత్యం కూడా మూడోసారి విజయం దక్కించుకోవడం విశేషం. ఇలా ఓటర్ల తీర్పు చూస్తే ఆశ్చర్యం వేయకమానదు.
చొప్పదండి నియోజకవర్గ ఓటర్ల తీర్పు గమ్మత్తుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకరికే అవకాశం ఇస్తారు. మరొకరికి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకసారి గెలిచిన తరువాత ఇక వారు మాజీ కావాల్సిందే. మరోమారు చాన్స్ ఇవ్వకుండా ఇంటికి పంపిస్తారు. దీంతో చొప్పదండి ఓటర్ల మనోగతం ఎవరికి అంతుచిక్కదు. ఎప్పుడు ఒక పార్టీకి కూడా అవకాశం ఇవ్వరు. గతంలో అయితే రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ మరో ఎమ్మెల్యే ఉండేవారు. ఉదాహరణకు చంద్రబాబు ప్రభుత్వంలో కోడూరి సత్యనారాయణ గౌడ్ ఎమ్మెల్యే కావడం తెలిసిందే.