పెండింగ్ బిల్లులపై చంద్రబాబు కీలక ప్రకటన!

ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించారు.

Update: 2025-01-11 16:45 GMT

వైసీపీ హయాంలో కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులను మాజీ సీఎం జగన్ పెండింగ్ లో పెట్టారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు చేసిన కాంట్రాక్టు పనులకు కూడా డబ్బులు చెల్లించకపోవడంతో చాలామంది నేతలు అప్పుల పాలయ్యారని వైసీపీ నేతలే విమర్శలు గుప్పించిన సందర్భాలు అనేకం. ఇక, విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు...అందరికీ జగన్ ఐదేళ్ల పాటు పెట్టిన పెండింగ్ బిల్లులు కూడా వైసీపీ ఓటమికి ఒక కారణమయ్యాయి.

ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు పెండింగ్ బిల్లులపై చర్చ జరిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖ పెండింగ్ బిల్లులపై వివరాలను చంద్రబాబు అడిగి తెలుసకున్నారు. ఎవరికి ఎంతెంత ఇవ్వాలని అని ఆరా తీశారు. దాంతోపాటు ఏపీ ఖజానా ఆర్థిక స్థితిగతులపై కూడా చర్చించారు. చిన్న చిన్న పనులు చేసి పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లులపై ప్రధానంగా ఆర్థిక శాఖ అధికారులతో చంద్రబాబు చర్చించారు.

ఇక, గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని చంద్రబాబు చెప్పారు. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానుందని, అక్కడ ఉత్పత్తయ్యే హైడ్రోజన్ తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని అన్నారు. గ్రీన్ ఎనర్జీతో తయారయ్యే ఎరువులు, రసాయనాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఇక, అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడడం వల్ల వేడి బాగా తగ్గుతుందని అన్నారు. కాకినాడలో నాగార్జున్ ఫర్టిలైజర్స్ ను గ్రీన్ కో కంపెనీ టేకోవర్ చేయబోతోందన్నారు.

Tags:    

Similar News