ఫుల్ జోష్ లో పిఠాపురం వర్మ...రీజనేంటో ?
టీడీపీ కూటమి మూడవ జాబితా తొందరగా విడుదల అవుతుందని అందులో వర్మ పేరు కచ్చితంగా ఉంటుందని అంటున్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గం నాయకుడు వర్మ ఫుల్ హ్యాపీస్ అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా పిఠాపురం వచ్చినపుడు వేదిక మీద వర్మకు కీలకమైన స్థానమే ఇచ్చారు. పవన్ ప్రసంగంలోనూ వర్మ గురించి ప్రస్తావించారు. వర్మతో సహా అందరినీ కలుపుకుని ప్రజల సమస్యల సాధనకు కృషి చేస్తామని అన్నారు.
మరి దానికి వర్మ ముఖం వెలిగిపోతుంది అంటే దాని కంటే చాలా పెద్ద రీజన్ ఉంది అని అంటున్నారు. వర్మ విషయంలో త్యాగరాజు అన్న పేరు ఉంది. ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పిఠాపురంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిముషంలో పవన్ అక్కడ నుంచి పోటీ చేయడంతో సీటు ఖాళీ చేయాల్సి వచ్చింది.
అయితే పవన్ కి పొత్తులో సీటు వదిలేసినందుకు ఆయనకు తగిన పదవి ఇస్తామని ఆనాడు టీడీపీ అధినాయకత్వం హామీ ఇచ్చింది. పవన్ కూడా తనదైన హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఏమీ జరగడం లేదు. ఎమ్మెల్సీ పదవి ఇస్తారనుకుని చూస్తున్నా అక్కడ కూడా లిస్ట్ పెద్దదిగానే ఉంది.
దాంతో అనుచరులు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్మ మాత్రం ఎక్కడా బయటపడలేదు. ఆయన తనదైన శైలిలో సైలెంట్ గానే పనిచేసుకుంటూ పోతున్నారు. పిఠాపురంలో మిత్రపక్షంగా ఆయన సహకారం జనసేనకు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చినపుడు ఆయనతో కలసి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
అయితే ఈసారి మాత్రం వర్మకు బలమైన హామీ దక్కిందని అంటున్నారు. ఆ తీపి కబురుని పవన్ మోసుకుని వచ్చారు అని అంటున్నారు. అదేంటి అంటే వర్మకు కేబినెట్ ర్యాంక్ కలిగిన నామినేటెడ్ పదవి ఒకటి దక్కబోతోంది అని అంటున్నారు. ఆయనకు క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ పదవిని తొందరలో ప్రకటిస్తారు అని అంటున్నారు.
టీడీపీ కూటమి మూడవ జాబితా తొందరగా విడుదల అవుతుందని అందులో వర్మ పేరు కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ విషయమే పవన్ నుంచి ఆయనకు సమచారంగా తెలిసిందని అంటున్నారు. దాంతో వర్మ చాలా ఖుషీగా ఉంటున్నారు అని అంటున్నారు.
తమ నాయకుడుకి ఇన్నాళ్ళ తరువాత అయినా కీలక పదవి దక్కితే అదే చాలు అని వర్మ అభిమానులు అనుచరులు అంటున్నారు. మొత్తానికి చూస్తే కాస్తా ఆలస్యంగా అయినా వర్మకు మంచి పదవే రిజర్వ్ చేసి పెట్టారు అని అంటున్నారు. చూడాలి మరి వర్మకు దక్కే పదవి అదేనా లేక ఇంకా పెద్ద పదవా లేక వర్మ అనుచరులు ఊహించని గొప్ప పదవి ఇంకా ఏదైనా కూటమి పెద్దలు రెడీ చేసి పెట్టారా అని అంటున్నారు.