బాబు అరెస్ట్ తరువాత ఫస్ట్ టైం ఢిల్లీకి జగన్...ఎపుడంటే...?

అయితే కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతోనే జగన్ ఢిల్లీ టూర్ ఆగిందని కూడా అంటూ వచ్చారు.

Update: 2023-10-03 10:30 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఖరారు అయినట్లుగా ప్రచారం సాగుతోంది. చాలా కాలం తరువాత ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత జగన్ ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్తూండడంతో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది.

ఈ నెల జగన్ ఢిల్లీ టూర్ కన్ ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈసారి టూర్ లో జగన్ రెండు రోజుల పాటు ఉంటారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో కీలక భేటీలు వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ రెండు రోజుల టూర్ లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ లతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని కూడా కలుస్తారు అని అంటున్నారు.

నిజానికి జగన్ ఢిల్లీ టూర్ గత నెలలో ఉండాల్సింది అని ప్రచారం సాగింది. జగన్ లండన్ టూర్ ని గత నెల 11న ముగించినుకుని వచ్చారు ఆయన ఆ వెంటనే అంటే సెప్టెంబర్ 14న ఢిల్లీకి వెళ్తారని వార్తలు వచ్చాయి.

అయితే కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతోనే జగన్ ఢిల్లీ టూర్ ఆగిందని కూడా అంటూ వచ్చారు. ఇపుడు జగన్ ఢిల్లీ పెద్దలతో భేటీకి సమయం వచ్చింది అంటున్నారు. ఆ దిశగా అపాయింట్మెంట్లు కుదిరాయని అంటున్నారు.

దాంతో జగన్ రెండు రోజుల పాటు హస్తినలో ఉంటారని, కీలకమైన వైషయాలతోనే ఆయన టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. ఒక వైపు చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో ఏపీలో వేడెక్కిన రాజకీయ పరిణామాలు ఉన్నాయి. అదే విధంగా చూస్తే టీడీపీ జనసేన పొత్తు అన్నది ఖరారు అయింది. అది అఫీషియల్ గానే పవన్ ప్రకటించారు

ఇంకో వైపు చూస్తే బాబు జైలులోనే పాతిక రోజులకు పైబడి ఉన్నారు. ఏపీలో టీడీపీ జనసేన ఒక్కటిగా నిలిచి ఉన్న క్రమంలో బీజేపీ రూట్ ఏంటో తెలియడంలేదు. దాంతో జగన్ ఢిల్లీ టూర్ లో బీజేపీ మనసులో మాటను కనుగొనే ప్రయత్నం చేస్తారా అన్న చర్చ నడుస్తోంది.

అది ఒక అంశం అయితే ఏపీలో ముందస్తు ఎన్నికల మీద చర్చ అలాగే సాగుతోంది. ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు. తెలంగాణా లో ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 12లోగా వస్తుందని అంటున్న క్రమంలో జగన్ కనుక కేంద్ర పెద్దలతో ముందస్తు ఎన్నికల మీద చర్చించి అక్కడ నుంచి వచ్చే ఆలోచనలను బట్టి అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయడంలేదు అంటున్నారు.

ఇప్పటికిపుడు ఏపీలో ఎన్నికలు జరిగితే కచ్చితంగా మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు చెబుతున్న నేపధ్యం ఉంది. దాంతో పాటు టీడీపీ అధినాయకత్వం జైలులో ఉంది. ఆ పార్టీ అయోయమయంలో ఉంది. ఇక జనసేన టీడీపీ పొత్తు పచ్చిగానే ఉంది. ఈ క్రమంలో రాజకీయ వ్యూహంతో ముందస్తుకు వైసీపీ సై అంటుందా అన్న చర్చ నడుస్తోంది.

దాంతో జగన్ ఢిల్లీ టూర్ పైన ఆసక్తి పెరిగిపోతోంది. ఇక బాబు అరెస్ట్ అనంతర పరిణామాలను బీజేపీ కేంద్ర పెద్దలతో జగన్ పంచుకుంటారా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి చూస్తే జగన్ ఢిల్లీ టూర్ మీద ఏపీ రాజకీయం అంతా వేయి కళ్లతో వీక్షిస్తోంది.

Tags:    

Similar News