ఔను.. టంగ్ స్లిప్పయింది సారీ: ముఖ్యమంత్రి క్షమాపణలు
ఆ వెంటనే నితీశ్ తనను తాను సరిదిద్దుకున్నారు. బుధవారం.. అసెంబ్లీ ప్రారంభం అవుతూనే సీఎం నితీశ్ మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే.
అడుసు తొక్కనేల.. కాలు కడుగ నేల అన్న మాట ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విషయం లో నిజమైంది. మంగళవారం ఆయన నిండు అసెంబ్లీలో కుల గణనపై మాట్లాడుతూ.. మహిళలు.. శృంగారంపై తీవ్ర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభాను నియంత్రించడంలో మహిళలు.. ముఖ్యంగా చదువుకున్నవారు ఆలోచనతో ఉండాలని ఆయన సూచిస్తూ.. అనరాని.. వినలేని వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై కేంద్రం నుంచి ఇటు బీజేపీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్పించాలంటూ.. నితీశ్‌పై బీజేపీ నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక, జాతీయ మహిళా కమిషన్ కూడా క్షమాపణలు చెప్పాల్సిందేనని నోటీసులు జారీ చేసింది.ఇక, కులగణనతో వచ్చిన ఇమేజ్.. ఈ వ్యాఖ్యలతో మట్టికొట్టుకు పోతుండడంతో నితీశ్ మద్దతు దారుల నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది.
ఆ వెంటనే నితీశ్ తనను తాను సరిదిద్దుకున్నారు. బుధవారం.. అసెంబ్లీ ప్రారంభం అవుతూనే సీఎం నితీశ్ మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే.. అంటూ ప్రసంగం ప్రారంభించారు. అయితే, విపక్ష మహిళా నాయకుల నుంచి బాధించి ఉంటే కాదు.. బాదించాయి! అని అరుపులు కేకలు వినిపించాయి. దీంతో నితీశ్.. సారీ.. ఏదో చెప్పబోయి.. ఏదో చెప్పాను. మిమ్మల్ని బాధించాను. వెరీ సారీ! అంటూ.. ముగించారు. మొత్తానికి నితీశ్ చేసిన వ్యాఖ్యల వివాదం ఇక్కడితో ఆగుతుందో.. ఎన్నికల వరకు సాగుతుందోచూడాలి.