బియ్యం సంచుల్లో 11 వేల కోట్ల కొకైన్... వీడియో వైరల్!
అనంతరం ఆ భారీ డ్రస్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్ బరువు 3,312 కిలోలు కాగా... దీని ధర సుమారు 11,623 కోట్ల రూపాయలని అంటున్నారు.
ప్రస్తుతం ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్ అత్యంత ప్రధానమైనది. అణుబాంబులతో నష్టం ఒకరకంగా ఉంటే... ఈ మాదకద్రవ్యాల వల్ల అంతకుమించి అన్నట్లుగా నష్టం ఉంటుందని చెబుతుంటారు. మనిషిలో మానవత్వాన్ని పూర్తిగా కనుమరుగు చేసి, రాక్షసత్వాన్ని తీసుకురావడంలో ఈ డ్రగ్స్ అత్యంత కీలకంగా పనిచేస్తాయని చెబుతుంటారు. ఇది కేవలం ఏ ఒక్కదేశం సమస్యో కాదు.. ఉగ్రవాదం మాదిరిగా ఇది పూర్తిగా ప్రపంచ సమస్య!
ఈడ్రగ్స్ ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకందుకు వాడుతూ, ఒక రకంగా వాడుతుంటే... వెనుకబడిన దేశాల్లో మరొకందుకు మరోలా వాడుతుంటారని రకరకాల కథనాలు వస్తుంటాయి! ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్న ఈ కొకైన్ బస్తాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి!
కొకైన్ అంటే చిన్న చిన్న ప్యాకెట్లలోనో.. కిలోల ప్యాకెట్లలోనో ఉంటుందని తెలుసు కానీ... సినిమాల్లో చూపించినట్లుగా ఏకంగా బియ్యం బస్తాల్లో ప్యాకై ఉంది. వీటిని ఎవరు చూసినా రైస్ బ్యాగ్స్ అనుకుని వదిలేస్తారని భావించారో.. లేక, భారీ ఎత్తున ఆర్డర్ వచ్చిందో ఏమో తెలియదు కానీ... ఏకంగా ఈ స్థాయిలో పెద్దఎత్తున బియ్యం బస్తాల్లో ప్యాక్ చేసి కొకైన్ ను తరలిస్తున్నారు.
అవును... అమెరికాలో తాజాగా పెద్దఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఈ మాదకద్రవ్యాలు బియ్యం సంచుల్లో ప్యాక్ చేయడం గమనార్హం. వీటిని దక్షిణ అమెరికా నుంచి యూరప్ కు తరలిస్తున్నారు. ఇలా భారీ ఎత్తున కొకైన్ ను తరలిస్తుండగా పరాగ్వే పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ భారీ డ్రస్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్ బరువు 3,312 కిలోలు కాగా... దీని ధర సుమారు 11,623 కోట్ల రూపాయలని అంటున్నారు.
ఇంతభారీ ఎత్తున కొనైన్ బస్తాలలో పట్టుబడటంతో ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.