అక్రమ వలసదారులను ట్రంప్ అలా పంపిస్తుంటే.. వారు ఇలా పంపించేస్తున్నారు!
తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఇందులో భాగంగా.. అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో సంకెళ్లు వేసి మరీ స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ ఘటన తెరపైకి వచ్చింది.
అవును... తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారందరినీ గుర్తించి, వారికి సంకెళ్లు వేసి, ప్రత్యేక విమానాల్లో వారి వారి స్వదేశాలకు పంపించేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వందల మందిని ఇలా తమ తమ దేశాలకు పంపించినట్లు చెబుతున్నారు.
అయితే.. దీనిపై కొలంబియా, బ్రెజిల్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాయి. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అనుసరిస్తున్న తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాయి. ఇలా వచ్చే వలసదారులకు చెందిన అమెరికా విమానాలను తమ దేశంలోకి అనుమతించమని కొలంబియా తేల్చి చెప్పగా.. బ్రెజిల్ కుడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా స్పందించిన కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో... కొలంబియా వలసదారులను తీసుకొచ్చే అమెరికా విమానాలను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధుస్తున్నామని ప్రకటించారు. ఎప్పుడైతే వలసదారులను గౌరవంగా స్వదేశాలకు పంపేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తుందో అప్పుడే వాటిని అనుమతిస్తామని తెలిపారు.
అక్రమ వలసదారులను నేరస్థులుగా చిత్రీకరించకుండా, అమెరికా పౌరవిమనాల్లో పంపిస్తేనే వాటిని తమదేశంలోకి అనుమతిస్తామని.. ఈ క్రమంలో ఇప్పటికే పలు అమెరిక సైనిక విమానాలను వెనక్కి పంపించేశామని పెట్రో పేర్కొన్నారు. దీంతో... ఈ విషయం ఇంట్రస్టింగ్ గా మారింది.
ఇదే సమయంలో... ఈ వ్యవహారంపై బ్రెజిల్ కూడా సీరియస్ గా ఉంది. ఇందులో భాగంగా... అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపించే విషయంలో అగ్రరాజ్యం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని మండిపడింది. ఇలా సంకెళ్లు వేసి పంపించడం అంటే.. వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. మరి దీనిపై ట్రంప్ రియాక్షన్ ఏమిటనేది వేచి చూడాలి!