ఎగ్జిట్ పోల్స్ బొక్క బోర్లా.. కనీసం అంచనా వేయడంలో తుస్
ఇప్పుడు తాజాగా ముగిసిన హరియాణా, కశ్మీర్ ఎన్నికల్లో ఎగ్గిట్ పోల్స్ దారుణంగా విఫమయ్యాయి.
ఎగ్టిట్ పోల్స్ కంటే ఎగ్జాక్ట్ పోల్స్ ను నమ్ముతాం.. అనేది రాజకీయ నాయకుల మాట. సరే అందరూ చెప్పేది ఇదే. ప్రతి ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెలువడడం సహజమే. ఒకప్పుడు ఇవి ఎన్నికల ముందు వెలువడేవి. అయితే, ఫలితాలను ప్రభావితం చేసేవిధంగా ఉండడంతో ఎన్నికల పోలింగ్ ముగిశాకనే వెల్లడించాలని నియమం పెట్టారు. ఇప్పుడు తాజాగా ముగిసిన హరియాణా, కశ్మీర్ ఎన్నికల్లో ఎగ్గిట్ పోల్స్ దారుణంగా విఫమయ్యాయి.
రెండుచోట్లా 90 సీట్లు
హరియాణా, కశ్మీర్ ఎన్నికల్లో సామీప్యత ఏమంటే.. రెండు చోట్లా 90 చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఐదేళ్లకు కశ్మీర్ లో ఎన్నికలు జరిగాయి. హరియాణాలో వరుసగా రెండుసార్లు బీజేపీ ప్రభుత్వమే ఉంది. దీంతో ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకంగా నిలిచాయి. అక్కడి ప్రజల నాడి ఏమిటో చూడాలని దేశమంతా చూడాలని దేశమంతా భావించింది.
ఒక్కటీ సరిగ్గా చెప్పలేదు..
హరియాణాలో ఈ నెల 5న 90 సీట్లకు ఓకేసారి పోలింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్ లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. కేంద్రపాలిత ప్రాంతంగా అక్కడ ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. కాగా, హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 దాటాలి. కశ్మీర్‌లోనూ 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ.. ఐదుగురు ఎమ్మెల్యేలను గవర్నర్ నామినేట్ చేయనున్నారు. అప్పుడు సంఖ్య 95కి పెరుగుతుంది. నామినేటెడ్ సభ్యులకూ ఓటు హక్కు కల్పిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు 48 మంది సభ్యుల మద్దతు అవసరం. కాగా, శనివారం పోలింగ్ ముగిశాక వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో హరియాణాలో కాంగ్రెస్ పార్టీ దే గెలుపని కచ్చితంగా చెప్పాయి. మొత్తం ఏడు ఎగ్జిట్ పోల్స్ లోనూ ఆ పార్టీకే అధిక శాతం సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఒక్కటి కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పలేదు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కలిపి చూపే పోల్ పోస్ట్ లోనూ కాంగ్రెస్ కు 50 వరకు సీట్లు వస్తాయని ఉంది. అయితే, ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.
హంగ్ లేదు.. ఎన్సీ-కాంగ్రెస్ దే ఆర్భాటం
అధికారంలోకి వచ్చేసినట్లేనని భావించిన హరియాణా చేజారిన కాంగ్రెస్ కు జమ్ముకశ్మీర్ ఫలితం పెద్ద ఊరట. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి పోటీ చేసిన ఆ పార్టీ కూటమికి అధికారం దక్కింది. వాస్తవానికి హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తుందని.. కశ్మీర్ లో హంగ్ అని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ, ఎన్సీ-కాంగ్రెస్ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించేసింది. ఇక్కడ బీజేపీ గెలుస్తుందని ఎవరికీ అంచనాలు లేవు. కాకపోతే.. హంగ్ ఏర్పడితే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ మద్దతుతో బీజేపీ ఏదైనా చేసే అవకాశం ఉంది. అందుకనే నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా ముందుజాగ్రత్తగా మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. అయితే, ఆ అవసరమే లేకపోయింది. చివరకు ఎగ్జిట్ పోల్స్ బొక్కా బోర్లా పడ్డాయి.