తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడినా.. పాలన ప్రారంభమయ్యేది అప్పుడే!
ఇప్పటికే మొహం వాచిపోయినట్టుగా గత పదేళ్లుగా పదవుల కోసం వేచి ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇ ప్పుడు వచ్చిన అవకాశం చేజార్చుకోవడం అస్సలు ఇష్టం లేదు.
`ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తే.. ` తెలంగాణలో ఏ నాలుగు దిక్కులు చూసినా.. ఇదే ముచ్చట వినిపిస్తోంది. ఇదే ముచ్చట కనిపిస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీలో అయితే.. గెలుపుపై దాదాపు ఆశలు చిగురించి.. మొగ్గేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒక్కటం టే ఒక్క సర్వే కూడా.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాకపోవడం.. మేజిక్ ఫిగర్ 60 స్థానాలకు చేరువలో కాంగ్రెస్ ఉండడం ఖాయమని వెల్లడించడంతో నాయకులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
మరో 15 గంటల్లో వెల్లడికానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం.. దరిమిలా.. కాంగ్రెస్ పార్టీ విజ యం దక్కించుకుంటే ఏం జరుగుతుంది? అనేది ప్రధాన ప్రశ్న. దీనిపై ఇప్పటికే అనేక విశ్లేషణలు.. చర్చలు జరుగుతున్నాయి. మొట్టమొదట. ముఖ్యమంత్రి పీఠంపై వివాదం తెరమీదికి వస్తుంది. ఈ విషయం తేలే సరికి రెండు వారాలకుపైగానే సమయం పట్టొచ్చు. ఇక, ఆ తర్వాత.. సీఎం అభ్యర్థిగా ఉన్న నాయకుడు.. ఏర్పాటు చేసుకునే మంత్రి వర్గంపైనా మరో రచ్చ పొంచి ఉంది.
ఇప్పటికే మొహం వాచిపోయినట్టుగా గత పదేళ్లుగా పదవుల కోసం వేచి ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇ ప్పుడు వచ్చిన అవకాశం చేజార్చుకోవడం అస్సలు ఇష్టం లేదు. సో.. ఇక్కడే కులాలు, మతాలు.. ప్రాంతా లు.. సహా అనేక అంశాలతో పాటు సీనియార్టీ, జూనియార్టీ వంటి అనేక విషయాలు కూడా తీవ్రస్థాయిలో వివాదాలకు మాటల తూటాలకు.. దారితీస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో మరో వారం రోజుల పాటు సమయం తినేయడం ఖాయమని అంటున్నారు.
ఒకవేళ.. ముందుగానే మంత్రివర్గాన్ని సిద్ధం చేసుకుందామా? అంటే, అది సీఎం అభ్యర్థిగా ఎంపికయ్యే నాయకుడిని బట్టి ఉంటుంది. ఇక్కడ అధిష్టానం వేసే అడుగు అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ దీనిని కూడా సామరస్యపూర్వకంగా తేల్చేసినా.. ఆ తర్వాత.. మంత్రి పదవుల విషయంలో మాత్రం రాజీ పడే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. లెక్కకు మించిన నాయకులు గత పదేళ్లుగా.. కాంగ్రెస్‌లో ఉంటూ.. బీఆర్ ఎస్‌ను ఏకేస్తున్నారు.
కాంగ్రెస్ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో వీరంతా తమ క్రెడిట్ కోరుకోవడంలో తప్పులేదు. కానీ, పరిస్థితి అందరికీ ఒకే లా ఉండే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్ ఏర్పడినా.. పాలన ప్రారంభించేందుకు కనీసంలో కనీసం నెల రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది గెలిచిన కర్ణాటకలో పాలన ప్రారంభించేందుకు 40 రోజుల సమయం పట్టడం గమనార్హం.