షాకింగ్... పక్క సీట్లో శవంతో విమాన ప్రయాణం!

వెనిస్ లో హాలిడే గడిపేందుకు మిషెల్ రింగ్, జెన్నిఫర్ కోలిన్ లు మెల్ బోర్న్ నుంచి దోహా వెళ్లే విమానం ఎక్కారు. ఈ సమయంలో... తమ పక్కన కూర్చున్న ఓ మహిళ విమానంలోనే మరణించారని ఆ జంట తెలిపింది.

Update: 2025-02-26 13:30 GMT

సాధారణంగా... బస్సులోనో, ట్రైన్ లోనో ప్రయాణిస్తున్నప్పుడు పక్కనున్న వారు తుమ్మినా, దగ్గినా.. అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. వారు ఉన్నంతలో పద్దతిగా లేకపోతే తీవ్ర ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అలాంటిది... విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పక్కన ఏకంగా శవమే ఉంటే..? ఆ పరిస్థితి తాజాగా ఓ జంటకు ఎదురైంది.

సరదాగా హాలిడే ఎంజాయ్ చేద్దామని బయలు దేరింది ఓ జంట. దీంతో... విమానంలో ప్రయాణం మొదలుపెట్టింది. ఈ సమయంలో వారి పక్క సీట్లో మరో మహిళ ఉన్నారు. అయితే.. కాసేపటికి ఆమె చనిపోయారు. ఈ విషయం విమానంలో సిబ్బందికి చెబితే.. ఆమె సీటు మార్చలేదు, వీరి సీటూ మార్చలేదు.. అలానే నాలుగు గంటలు ప్రయాణం చేసింది ఆ జంట.

అవును... వెనిస్ లో హాలిడే గడిపేందుకు మిషెల్ రింగ్, జెన్నిఫర్ కోలిన్ లు మెల్ బోర్న్ నుంచి దోహా వెళ్లే విమానం ఎక్కారు. ఈ సమయంలో... తమ పక్కన కూర్చున్న ఓ మహిళ విమానంలోనే మరణించారని ఆ జంట తెలిపింది. ఆమె చనిపోయిందని చెప్పిన తర్వాత.. విమానంలో సిబ్బంది ఆమెను మరో చోటకి పంపలేదు.. తమకు మరో ఆప్షన్ ఇవ్వలేదని తెలిపింది.

ఆమె మరణించారని చెప్పగానే.. వెంటనే వచ్చి ఆమెపై ఓ దుప్పటి కప్పి వెళ్లిపోయారని.. విమానంలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ అందులో కూర్చునేందుకు తమను అనుమతించలేదని మిషెల్ రింగ్ తెలిపారు. దీంతో... సుమారు నాలుగు గంటల పాటు తాము మృతదేహం పక్కనే కూర్చుని ప్రయాణించాల్సి వచ్చిందని మండిపడ్డారు.

దీంతో... ఆ జంటకు కలిగిన అసౌకర్యానికి క్షామాపణలు చెప్పింది ఖతార్ ఎయిర్ వేసి.. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఇదే సమయంలో.. ఆ జంటను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే... తమను ఖతర్ ఎయిర్ వేస్ కానీ.. టిక్కెట్లు బుక్ చేసిన ఖాంటాస్ సంస్థ కానీ సంప్రదించలేదని ఆ జంట స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా... ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు విమానంలో ఉన్న ప్రయాణికుల విషయంలో అనుసరించాల్సిన నియమావళిని ఏర్పాటు చేయడం అవసరమని రింగ్, కోలిన్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News