ఏపీలో కూటమి విజయానికి కారణం చెప్పిన 'కామ్రెడ్!'
ఇది ఒక అఖండమైన అపురూ పమైన విజయంగానే.. విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏపీలో ఎవరూ ఊహించని విధంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి విజయం దక్కించుకుంది. కనీ వినీ ఎరుగని రీతిలో సీట్లు, ఓట్లు కూడా.. దక్కించుకుంది. టీడీపీ ఒంటరిగానే.. 135 సీట్లు దక్కించుకుంది. ఇక, బీజేపీ 10 చోట్ల పోటీ చేసి.. 8 స్థానాలు దక్కించుకుంది. ఇక, జనసేన 100 శాతం విజయం సొంతం చేసు కుంది. 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలను కూడా.. సొంతం చేసుకుంది. ఇది ఒక అఖండమైన అపురూ పమైన విజయంగానే.. విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏపీలో చోటు చేసుకున్న ఈ పరిణామంపై.. సీపీఐ సీనియర్ నాయకుడు, కామ్రెడ్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమివిజయానికి ఐక్యతే కారణమని తేల్చి చెప్పారు. తాజాగా ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. ఏపీలో ఐక్యంగా కూటమి పార్టీలు ప్రచారం చేశాయని.. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పారు. మరీ ముఖ్యంగా అసలు ఓటు బ్యాంకు లేని బీజేపీ కూడా.. భారీ ఫలితాన్ని రాబట్టు కోవడం వెనుక ఈ ఐక్యతే కారణమని పేర్కొన్నారు. జనసేన వంద శాతం గెలవడం.. చరిత్రాత్మక మని పేర్కొన్నారు.
ఇక, తెలంగాణ ఎన్నికలపై మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. అయినా కూడా.. ఆ పార్టీకి ఓట్లు తగ్గాయని. దీంతో సీట్లు కూడా.. తగ్గాయనినారాయణ చెప్పారు. దీనికి ప్రధాన కార ణం.. ఓట్లు , సీట్లు లేవని.. కమ్యూనిస్టు పార్టీలను.. ఇతర పార్టీలను దూరం చేసుకోవడమేనని అన్నారు. ఓట్లు సీట్లు లేకపోయినా.. పొత్తు పెట్టుకుని ఉంటే.. ఫలితం వేరేగా ఉండేదన్నారు. ఇది తమిళనాడులో సాకారం అయిందని చెప్పారు. అక్కడ పొత్తు పెట్టుకున్న స్టాలిన్ మంచి విజయం దక్కించుకున్నారన కామ్రెడ్ తెలిపారు.