రాష్ట్రపతి భవన్ లో ఆమె పెళ్లి.. స్పెషల్ పర్మిషన్

ఇంతకూ పెళ్లి కుమార్తె ఎవరు? ఎందుకని ఆమె పెళ్లికి రాష్ట్రపతి భవన్ వేదికగా మారటానికి కారణమేంటి? అన్న వివరాల్లోకి వెళితే..;

Update: 2025-02-01 07:43 GMT

అవును.. ఆమె పెళ్లి కోసం దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అధికార నివాసం.. రాష్ట్రపతి భవన్ వేదికగా మారింది. ఇందు కోసం ప్రత్యేక అనుమతులు జారీ చేశారు. ఇంతకూ పెళ్లి కుమార్తె ఎవరు? ఎందుకని ఆమె పెళ్లికి రాష్ట్రపతి భవన్ వేదికగా మారటానికి కారణమేంటి? అన్న వివరాల్లోకి వెళితే..

రాష్ట్రపతి భవనంలో పీఎస్ వోగా సేవలు అందిస్తున్న సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా పెళ్లి జరగనుంది. ఆమె పెళ్లి కోసం రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరెసా క్రౌన్ కాంప్లెక్స్ లో వివాహ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేశారు. ఇంతకూ పెళ్లి కుమారుడు ఎవరంటే.. సీఆర్ పీఎఫ్ విభాగంలోనే పని చేసే ఉన్నతాధికారి కావటం విశేషం.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అత్యంత గౌరవప్రదమైన రాష్ట్రపతి భవన్ వేదికగా ఒక అధికారి వివాహం జరగటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ పెళ్లిని పలువురు చారిత్రత్మాకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరువుతున్నారు. అదే సమయంలో పెళ్లికి హాజరయ్యే ఇరు వర్గాలకు సంబంధించిన వారికి సంబంధించిన లాంఛనాలు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ లో ప్రవేశానికి ప్రత్యేక అనుమతులతో పాటు. దాదాపు నెలకు ముందే అన్నీ అనుమతులు పొంది ఉండాల్సి ఉంటుంది.

జమ్మూకశ్మీర్ లో సీఆర్పీఎఫ్ అసిస్టెంబ్ కమాండెంట్ గా సేవలు అందిస్తున్న అవనీశ్ కుమార్ తో పూనమ్ గుప్తా వివాహం ఫిబ్రవరి 12న పెళ్లి జరగనుంది. మధ్యప్రదేశ్ కు చెందిన పూనమ్ గుప్తా.. 2019 లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ ఎగ్జామ్ లో 81వ ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత సీఆర్ పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పోస్టింగ్ లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన కవాతులో సీఆర్ పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ సారథ్యం వహించారు.

పూనమ్ తల్లిదండ్రుల విషయానికి వస్తే.. నవోదయ విద్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్న రఘువీర్ గుప్తా తండ్రి కాగా.. తల్లి ఇంట్లోనే ఉంటారని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లోని శివపురిలోని శ్రీరామ్ కాలనీలో వారి నివాసం. గణితంలో గ్రాడ్యుయేషన్.. ఇంగ్లిషు లిటరేచర్ లో మాస్టర్స్ చేసిన ఆమె.. గ్వాలియర్ లోని జివాజీ వర్సిటీ నుంచి బీఈడీ చేశారు. అంతకు ముందు షియోపూర్ లోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థి.

Tags:    

Similar News