ఎప్పుడు బడితే అప్పుడు మీడియాను పిలుస్తారా?: చిన్నమ్మ చిందులు..!
కానీ, కీలకమైన సమయంలో మాత్రం మీడియాకు ఆమె ముఖం చాటేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
''నేను వస్తుంటే.. కనీసం మీరు మీడియా వాళ్లను కూడా పిలవడం లేదు. చిన్నచిన్నవి కాదు.. కదా? మెయిన్ మీడియా.. మెయిన్ మీడియాను పిలవండి. మన వాయిస్ వినిపించాలంటే.. మెయిన్ మీడియా ఉండాలి'' - నిన్న మొన్నటి వరకు మీడియా గురించి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు.. దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇవి. నిజమే.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా ఆమెకు ఆ అధికారం.. ఆ ప్రచారం కావాల్సిందే. ఎవరూ తప్పుబట్టరు. కానీ, కీలకమైన సమయంలో మాత్రం మీడియాకు ఆమె ముఖం చాటేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
''మేడం వస్తున్నారు. మీడియాను పిలుద్దామా?'' అని తాజాగా ఓ నాయకుడు చెప్పారు. దీనికి ఆమె ఖస్సు న బుస కొట్టారట. ''మైండుందా లేదా? సమయం సందర్భం చూసుకోవక్కర్లేదా? ఎప్పుడు పడితే అప్పు డు మీడియాను పిలుస్తారా?'' అని ఫోన్‌లోనే నిప్పులు చెరిగారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిశనివారం-ఆదివారం ఆమె ఏపీలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతోనూ మాట్లాడుతున్నారు.
కానీ, గత రెండు వారాలుగా మాత్రం మీడియాకు ముఖం చాటేస్తున్నారు చిన్నమ్మ. సైలెంట్‌గా పరుచూరుకు, రాజమండ్రికి వచ్చి వెళ్లిపోతున్నారు. ఇదేసమయంలో స్థానిక నాయకులకు కూడా కొన్ని సూచనలు చేశారని బీజేపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. ''ఎవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడొద్దు!'' అన్నది దాని సారాంశం. దీంతో మీడియా ముందుకు వచ్చేందుకు మిగిలిన నాయకులు కూడా రావడం లేదు. వచ్చినా. మోడీ భజన, సీతమ్మ స్త్రోత్రాలతో సరిపుచ్చుతున్నారు.
మరి.. దీనికి కారణమేంటి? అనేది చూస్తే.. మూడు ప్రశ్నల విషయంలో చిన్నమ్మ చిరాకు పడుతున్నార ట. 1) కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఒరిగిందేంటి. 2) ఏపీ వైసీపీ హయాంలో 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు కదా.. మరి చంద్రబాబు ఆ అప్పులు అన్నీ కలిపి(తన హయాంలో కూడా) 9.7 లక్షల కోట్లని తేల్చాలు కదా! ఇప్పుడు ఏమంటారు?. 3) కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు. ఈ ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి.. మీడియా నుంచి తప్పించుకుంటున్నారని కమల నాథులే పెదవి విరుస్తున్నారు.