కాళేశ్వరం మేడిగడ్డపై డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక!

అవును... కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ (ఎన్.డి.ఎస్.ఏ) సంచలన నివేదిక బయట పెట్టింది.

Update: 2023-11-03 15:22 GMT

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పైగా ఎన్నికల సీజన్ కావడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ అయ్యిందనే కామెంట్లూ వినిపించాయి. ఈ సమయంలో ఈ ఘటనపై డ్యాం సేఫ్టీ అథారిటీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా శుక్రవారం తన నివేదికను సమర్పించింది. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఈ నివేదిక తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అవును... కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ (ఎన్.డి.ఎస్.ఏ) సంచలన నివేదిక బయట పెట్టింది. ఇందులో భాగంగా... ప్లానింగ్, డిజైన్, క్వాలీటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్దారణకు వచ్చిందని తెలుస్తుంది! ఇదే సమయంలో... బ్యారేజ్ వైఫల్యం కారణంగా ప్రజా జీవితానికి, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొంది.

ఇదే సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్ ను వినియోగించే అవకాశం లేదని నివేధిక స్పష్టం చేసింది. ఇదే క్రమంలో... బ్యారేజీ పునాదుల కింద ఇసుక పోయడం వల్లే బ్యారేజీ కూలిపోయిందని నిర్ధారిస్తూ... మరిన్ని కారణాలను తమ నివేదికలో పొందుపరిచారు. బ్యారేజీ పునాదుల కింద ఇసుక కోతకు గురికావడం వల్లే వంతెన కుంగిపోయిందని నివేదికలో పేర్కొన్నారు.

అదేవిధంగా... మొత్తం బ్యారేజీని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలని ఎన్.డి.ఎస్.ఏ. అభిప్రాయపడటం గమనార్హం. ఇదే క్రమంలో... అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించిన ఎన్.డి.ఎస్.ఏ... డ్యాం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని నివేదికలో పేర్కొంది.

ఇదే క్రమంలో... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్, వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌ లపై తెలంగాణ సర్కార్‌ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది.

ఎన్.డి.ఎస్.ఏ. ఇచ్చిన కారణాలు..!:

* ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్, మెయింటెనెన్స్ వైఫల్యంతో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిపోయాయి.

* పునాది పదార్థం ఘనమైనది కాదు.

* బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది

* బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌ గా డిజైన్ చేశారు కానీ.. ఫిక్స్డ్ స్ట్రక్చర్‌ గా కాదు.

* బ్యారేజీ లోడ్ కారణంగా కాంక్రీటు తెగిపోయింది.

* బ్యారేజీ విఫలమైతే ఆర్థిక వ్యవస్థకు, ప్రజాజీవితానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది.

* ఈ దశలో రిజర్వాయర్ నిండితే బ్యారేజీ మరింత కుంగిపోతుంది.

* బ్యారేజీ బ్లాకుల సమస్య కారణంగా మొత్తం బ్యారేజీని వినియోగించుకునే అవకాశం లేదు.

Tags:    

Similar News