ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత్ బ్యాండ్... టాస్క్ ఇదే!

ఈ సమయంలో ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఢోల్ బ్యాండ్ రెడీ అవుతోంది.

Update: 2025-01-07 07:21 GMT

గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20న ఆయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సమయంలో ట్రంప్ కోసం ప్రత్యేకంగా భారతీయ అమెరికన్ ఢోల్ బ్యాండ్ సందడి చేయనున్నట్లు చెబుతున్నారు.

అవును... జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఢోల్ బ్యాండ్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా.. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు “క్యాపిటల్ హిల్ నుంచి వైట్ హౌస్ వరకూ” జరగనున్న పరేడ్ లో ఈ ఢోల్ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనున్నారు!

దీనికి సంబంధించిన ప్రత్యేక ఆహ్వానం టెక్సాస్ నుంచి పనిచేస్తున్న శివమ్ ఢోల్ తాషా పాఠక్ కు వైట్ హౌస్ నుంచి అందిందని అంటున్నారు. దీంతో... ఈ బ్యాండ్ ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించనుందని ఆశాభావం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా తమను ఆహ్వానించిన వారికి శివమ్ ఢోల్ తాషా పాఠక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా... భారత్ ఢోల్ బ్యాండ్ కు ఉన్న హై ఎనర్జీని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తామని.. అందుకు ఈ అవకాశం చాలా బాగా ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు కార్యక్రమంలో... ఈ బ్యాండ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా.. గత ఏడాది నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ను రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి అమెరికా క్యాపిటల్ భవనం లోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతం వేదిక కానుంది. ప్రపంచ దేశాల అధినేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు చెబుతున్నారు. ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమంలో... భారత్ ఢోల్ బ్యాండ్ ధూమ్ ధామ్ చేయనుందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News