నెహ్రూ.. ఇందిరమ్మ రికార్డును సమం చేస్తున్న మోడీ

ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఏయే అంశాల్ని ప్రస్తావిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Update: 2024-08-14 05:20 GMT

కీలకమైన రికార్డును సమం చేసే అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగు దూరంలో ఉన్నారు. మరో రోజులో ఆయన ఈ క్లిష్టమైన రికార్డును సమం చేయనున్నారు. ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానమంత్రి మోడీ పంద్రాగస్టు వేళ జాతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తే.. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. ఆ తర్వత కాలంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. సుదీర్ఘ కాలం ప్రధాని పదవిలో ఉన్న ఇందిరమ్మ రికార్డును మోడీ సమం చేయనున్నారు.

ఈ పంద్రాగస్టుకు ఇదో ప్రత్యేకత కానుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఏయే అంశాల్ని ప్రస్తావిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్వతంత్య్ర భారతంలో దేశ ప్రధానులుగా పని చేసిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ.. ఆయన కుమార్తె ఇందిరాగాంధీలు మాత్రమే వరుసగా 11 సార్లు పంద్రాగస్టు రోజున ప్రసంగాలు చేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆ అరుదైన రికార్డును చేరుకుంటారు.

మోడీ తర్వాత ఎక్కవ సార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన ప్రధానిగా మన్మోహన్ సింగ్ నిలుస్తారు. ఆయన పదిసార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేశారు. ఇక.. ఇందిరాగాంధీ విషయానికి వస్తే ఆమె వరుసగా పదకొండుసార్లు.. మొత్తంగా 15 సంవత్సరాల 350 రోజుల పాటు దేశ ప్రధానిగా వ్యవహరించారు. అత్యధిక సార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన ప్రధానిగా ఇందిరాగాంధీ నిలుస్తారు. కానీ.. నాన్ స్టాప్ గా పంద్రాగస్టు ప్రసంగాల్ని చేసిన ప్రధానిగా వచ్చే ఏడాది నుంచి నరేంద్ర మోడీ కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్లనున్నారు.

Tags:    

Similar News