ట్రంప్ ఫస్ట్ డే సంతకాలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవే!

అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసారు.

Update: 2025-01-22 05:39 GMT

అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై అటు అమెరికాలోనే కాకుండా ఇటు ప్రపంచ దేశాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దామ్!

అవును... ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానంగా... జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మరికొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్.

యూఎన్ ఆరోగ్య సంస్థకు నిధులు ఇచ్చే విషయంలో చైనా కంటే అన్యాయంగా వాషింగ్టన్ ఎక్కువ చెల్లిస్తోందని చెప్పిన ట్రంప్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగాలనే ఆర్డర్ పై సంతకం చేశారు.

ఇదే సమయంలో... ఫెడరల్ వర్కర్లు అందరూ పూర్తి సమయం ఆఫీసులకు తిరిగి రావాలని.. కోవిడ్ సమయం నుంచి వస్తున్న వర్క్ ఫ్రం హోం అలవెన్సులు ఇప్పుడు అందుబాటులో లేవని ఎగిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

మొదటిసారి అమెరికా అధ్యక్షుడైన సమయంలో చేసిన చర్యను ట్రంప్ పునరావృతం చేశారు. ఇందులో భాగంగా... పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకున్నారు.

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ పై కొత్త ఆంక్షలు విధించే ఉత్తర్వ్యులపైనా ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా... అమెరికా - మెక్సికో సరిహద్దుకు సైన్యాన్ని పంపుతానని కూడా ప్రకటించారు.

ఎల్.జీ.బీ.టీ.క్యూ సమానత్వం కోసం ప్రమోషన్లను రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో ప్రభుత్వం ఇకపై ఆడ, మగ అనే రెండు లింగాలను మాత్రమే గుర్తిస్తుందని స్పష్టం చేశారు.

చైనా సంస్థకు చెందిన టిక్ టాక్ కు 75 రోజులపాటు ఉమశమనం కల్పించే ఆదేశాలపైనా ట్రంప్ సంతకం చేశారు. ఈ సమయంలో.. జాతీయ భద్రతే లక్ష్యంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఉగ్రవాద దేశంగా క్యూబాపై ఉన్న ముద్రను తొలగిస్తూ మాజీ ప్రెసిడెంట్ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని తిరగదోడే ఆదేశాలపైనా ట్రంప్ సంతకం చేశారు.

గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు.

ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం డెనాలికి మౌంట్ మెకిన్లీగా పేరు మరుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News