హష్ మనీ కేసులో ట్రంప్ కు శిక్ష.. న్యాయమూర్తి సంచలన ఆదేశాలు!

పో*ర్న్ స్టార్ కు హష్ మనీ వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-04 04:47 GMT

మరో మూడు వారాల్లో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తీసుకోబోయే నిర్ణయాలపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పో*ర్న్ స్టార్ కు హష్ మనీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... పో*ర్న్ స్టార్ కు హష్ మనీ వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కేసులో ట్రంప్ కు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.

పో*ర్న్ స్టార్ కు డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసుపై తాజాగా జరిగిన విచారణ అనంతరం స్పందించిన న్యూయార్క్ జస్టిస్ హవాన్ మర్చన్... ట్రంప్ కు జనవరి 10న శిక్ష విధిస్తానని ఆదేశాలు జారీ చేశారు. అయితే... ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జరిమానాపైనా స్పందించారు.

ఇందులో భాగంగా.. ఈ కేసులో డొనాల్డ్ ట్రంప్ జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్ కండీషనల్ డిశ్చార్జ్ ని అమలు చేస్తామని.. శిక్ష విధించే రోజు (జనవరి 10) ఆయన వ్యక్తిగతంగా.. లేదా, వర్చువల్ గా కోర్టులో హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. దీంతో.. ట్రంప్ పేరున సరికొత్త రికార్డ్ నెలకొనే అవకాశం ఉంది.

ఇందులో భాగంగా... శిక్ష ఖరారైన తర్వాత వైట్ హౌస్ లోకి అడుగుపెట్టే తొలి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచే అవకాశం ఉంది.

కాగా... పో*ర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ తో గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు డొనాల్డ్ ట్రంప్ పై ఉన్నాయి. ఈ క్రమంలో... 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ వ్యవహారంపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు.. ట్రంప్, తన న్యాయవాదితో ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్ మనీని ఇప్పించారనేది ఆరోపణ.

ఈ సమయంలో దీనికి సంబంధించిన విచారణ అనంతరం ట్రంప్ పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో.. ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ కూడా స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు.

Tags:    

Similar News