భూ ప్రకంపనలతో వణికిన ఢిల్లీ... హిమాలయ దేశంలో 24 మంది మృతి!

ఇటీవలి కాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించడం దీంతో మూడోసారి కావడం గమనార్హం.

Update: 2023-11-04 04:18 GMT

శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో దేశ రాజధాని ప్రాంత ప్రజలు వణికిపోయారు. దీనికి కారణం నేపాల్‌ లో శుక్రవారం రాత్రి రిక్టర్‌ స్కేల్‌ పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడమే. దీంతో భారత్‌ లోని పలు ప్రదేశాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్‌ లోని పలు ప్రాంతాల్లో సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు!

శుక్రవారం రాత్రి 11:32 ప్రాంతంలో సంభవించిన భూకంపం కేంద్రం.. 10 కిలోమీటర్ల లోతులో నేపాల్‌ లో 28.84° అక్షాంశం, 82.19° రేఖాంశంతో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించడం దీంతో మూడోసారి కావడం గమనార్హం. ఆ సమయంలో ఢిల్లీ ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మళ్లీ వస్తుందేమోనని ఇంటిముందు రోడ్లపైనే ఉండిపోయారు.

ఈ సందర్భంగా ఎవరికి వారు వారివారి అనుభవాలను వార్తా సంస్థలతో పంచుకున్నారు! ఇందులో భాగంగా... తాను మంచం మీద పడుకున్న సమయంలో... అది వణకడం ప్రారంభించింది, మరోపక్క సీలింగ్ ఫ్యాన్ కూడా కదులుతుంది.. దీంతో వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగు తీశాను అని అని పాట్నా నివాసి తెలిపారు. మరికొంతమంది టీవీ చూస్తున్న సమయంలో దానికదే టీవీ ఊగడం, వారు కుర్చున్న కుర్చీ కదలమండతో కంగారుగా రోడ్లపైకి వచ్చినట్లు తెలిపారు!

ఇలా రాత్రి సమయంలో సంభవించిన ఈ భూ ప్రకంపనలతో భయాందోళనలకు గురైన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. భూమి స్థంభించడం ఆగిపోయినప్పటికీ... ఇళ్లలోకి వెళ్లడానికి సంసయించారు. దీంతో చాలాసేపటివరకూ రోడ్లపైనే ఉండిపోయారు. అయితే ఈ భూకంపం వల్ల ఇండియాలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

ఇదే సమయంలో ఈ భూకంప తీవ్ర నేపాల్‌ లో ఎక్కువగా ఉంది. నేపాల్‌ లో శుక్రవారం రాత్రి 6.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా కనీసం 64 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జాజర్‌ కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకే ఇంటికి చెందిన ఒక మహిళ, చిన్నారి కూడా ఉన్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News