బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబుకు ఈసీ నోటీసులు...!
అవి ఆధారం లేని విమర్శలు అని ఎన్నికల కోడ్ ని ఉల్లంఘిస్తూ బాబు చేసిన విమర్శలు అంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నుంచి నోటీసులు వచ్చాయి. ఆయన ఇటీవల ఎమ్మిగనూరు బాపట్ల, మార్కాపురం సభలలో జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. అవి ఆధారం లేని విమర్శలు అని ఎన్నికల కోడ్ ని ఉల్లంఘిస్తూ బాబు చేసిన విమర్శలు అంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
దాంతో చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. నలభై ఎనిమిది గంటలలోగా వాటికి బాబుకు జవాబు చెప్పాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే చంద్రబాబు ఈ సభలలో జగన్ ని పట్టుకుని వ్యక్తిగతంగా నిందించారు అని వైసీపీ ఆరోపించింది.
చంద్రబాబు జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అని కూడా పేర్కొంది. వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు దీని మీద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈ సభలలో జగన్ మీద బాబు చేసిన విమర్శలు తీవ్రంగా ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ఇమేజ్ దెబ్బ తినేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. దీంతో బాబుకు ఈసీ నోటీసులు ఇచ్చింది.
దీని మీద చంద్రబాబు ఏ వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే బాబు గోదావరి జిల్లాల సభలలోనూ జగన్ మీద విమర్శలు చేశారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ ఆయన జగన్ శవ రాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ డీఎన్ ఏలోనే శవ రాజకీయం ఉందని నిప్పులు చెరిగారు. మరి ఈ విమర్శల మీద కూడా వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉంది అని అంటున్నారు.
ఎన్నికల నిబంధనలు కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం చూస్తే ఆధారాలు లేని ఆరోపణలు చేయరాదు. అలాగే కోర్టు కేసులలో విచారణ దశలో ఉన్న వాటి మీద విమర్శలు చేయడం ముద్దాయిలుగా ఆయా వ్యక్తులను చేస్తూ వారి ఇమేజ్ ని జనంలో పలుచన చేయడం చేయకూడదు. దీంతో వైసీపీ చంద్రబాబు ప్రసంగాల మీద పూర్తి ఫోకస్ పెట్టింది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.