40 మంది ఉన్న జలాంతర్గామి మునిగిపోయింది... అసలేం జరిగింది?
సాధారణంగా టూరిస్ట్ బోట్లు ప్రమాదానికి గురవ్వడం వంటి వార్తలు వింటామనే సంగతి తెలిసిందే.;

సాధారణంగా టూరిస్ట్ బోట్లు ప్రమాదానికి గురవ్వడం వంటి వార్తలు వింటామనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 14 మాత్రమే ఉన్న జలతర్గాముల్లో ఒకటి తాజాగా ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో సబ్ మెరైన్ లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉండగా.. వీరిలో మృతులు, గాయాలైన వారి వివరాలు తాజాగా తెరపైకి వచ్చాయి.
అవును... తాజాగా ఈజిప్టు తీర నగరమైన హుర్ ఘడ్ లో ఎర్ర సముద్రంలో టూరిస్టుల జలాంతర్గామి మునిగిపోయింది. ఈ సందర్భంగా.. ప్రమాద సమయంలో సబ్ మెరైన్ లో సుమారు 40 మంది ఉన్నరని సంస్థ తెలిపింది. ఇందులో ఆరుగురు మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయని వెల్లడించింది.
అయితే... ఆ గాయాలపాలైనవారిలో నలుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు చెబుతున్నారు. నౌకాశ్రయం సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య తక్కువగా ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన సంస్థ... ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి జలాంతర్గాములు 14 మాత్రమే ఉన్నాయని.. వాటిలో రెండు సర్వీసులు తమవేనని పేర్కొంది.
వాస్తవానికి హుర్ ఘడ నగరం పర్యాటకానికి ఎంతో ప్రసిద్ధి.. ఇక్కడ బీచ్ లు, పగడపు దిబ్బలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. దీంతో... పర్యాటక జలాంతర్గాములు ఇక్కడ సేవలందందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సింద్ బాద్ అనే టూరిస్ట్ సబ్ మెరైన్ ప్రమాదానికి గురైంది!