ఆసియన్ కాదు పాకిస్థాన్ గ్రూమింగ్ గ్యాంగ్స్... మన ఎంపీకి మస్క్ ఇంట్రస్టింగ్ రిప్లై!

ఈ సమయంలో “ఆసియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్” అంటూ ఓ ప్రచారం మొదలైంది.. దీనిపై భారత ఎంపీ స్పందించారు.

Update: 2025-01-09 14:30 GMT

గత కొన్ని రోజులుగా బ్రిటన్ లో "గ్రూమింగ్ గ్యాంగ్" అంశం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమయంలో “ఆసియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్” అంటూ ఓ ప్రచారం మొదలైంది.. దీనిపై భారత ఎంపీ స్పందించారు.

ఇందులో భాగంగా.. "ఆసియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్" అంటూ జరుగుతోన్న ప్రచారంపై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా.. ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. "పాకిస్థాన్ గ్రూమింగ్ గ్యాంగ్స్" అని పిలవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈమె పోస్టు పై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు.

అవును... "ఆసియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్" కాదు.. "పాకిస్థాన్ గ్రూమింగ్ గ్యాంగ్స్" అని పిలవాలని.. ఒక దేశం చేసిన పనిని, ఆసియన్లందరికీ ఆపాదించడం ఎందుకని ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రశించారు. దీనిపై స్పందించిన స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్... అది నిజమే అంటూ బదులిచ్చారు.

కాగా... 2008-13 సమయంలో పాకిస్థాన్ మూలాలు ఉన్న వ్యక్తి ఓల్డ్ హోమ్ లో లైంగిక వేధింపుల గ్యాంగ్ లను నడిపాడని.. దీనిపై అప్పట్లో క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్ గా ఉన్న ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ పట్టించుకోలేదని ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో.. మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు.

ఇందులో భాగంగా... బ్రిటన్ లో జరిగిన అత్యంత ఘోరమైన నేరాల్లోనూ ఆయనకు కూడా భాగస్వామ్యం ఉందని మస్క్ ఆరోపించారు. దీనిపై విచారణను లేబర్ పార్టీ తిరస్కరించిన నేపథ్యంలో.. పార్లమెంటును రద్దు చేసి ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలని బ్రిటన్ కింగ్ ఛార్లెస్ కు ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు. అయితే.. ఈ ఆరోపణలను బ్రిటన్ ప్రభుత్వం ఖండించింది.

Tags:    

Similar News