నోబెల్ బహుమతి రేసులో ఎలాన్ మస్క్... ఏ కేటగిరీయో తెలుసా?
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి నామినేట్ అయ్యారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి నామినేట్ అయ్యారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వాస్తవానికి అమెరికా అధ్యక్షబరిలో డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇవ్వడానికి ముందువరకూ ఒకలెక్క, వైట్ హౌస్ లోకి ట్రంప్ ఎంట్రీ తర్వాత ఒకలెక్క అన్నట్లుగా ఎలాన్ మస్క్ పరిస్థితి ఉందని చెబుతున్నారు.
ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎలాన్ మస్క్ కు పర్సనల్ గా అన్నగా మారారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... నార్వేలోని నోబెల్ అవార్డుల కమిటీకి యూరోపియన్ యూనియన్ నుంచి ఓ ప్రతిపాదన అందిందని.. అందులో ఎలాన్ మస్క్ పేరు ప్రతిపాదించబడిందని అంటున్నారు.
ఈ మేరకు యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంక్ గ్రీమ్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి గత ఏడాది ఫిబ్రవరిలోనూ ఎలాన్ మస్క్ నోబెల్ బహుమతి రేసులో ఉన్నారు. అపట్లో నార్వేకు చెందిన పార్లమెంట్ సభ్యుడు మారియస్ నీల్సన్ ఆయన పేరును ప్రతిపాదించారు. ఇంతకూ మస్క్ పేరు ఏ కేటగిరీలో ప్రతిపాదించబడిందంటే.. 'శాంతి' కేటగిరీలో!
అవును... అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి ప్రపంచ కుకేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత, ట్రంప్ 2.0లో ‘డోజ్’ సారథి అయిన ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు. వాస్తవానికి సామాజిక సేవ చేసినవారికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు. అయితే... వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన ఎలాన్ మస్క్ కు ఈ కేటగిరీలో బహుమతికి నామినేషన్ రావడం గమనార్హం.
కాగా 1901 నుంచి నోబెల్ బహుమతిని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం / వైద్యం, సాహిత్యం, శాంతి రంగాల్లో ప్రధానం చేయబడుతున్న సంగతి తెలిసిందే. అయితే... 1968లో ఈ కేటగిరీల్లో ఆర్థిక శాస్త్రం కూడా చేర్చబడింది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ పేరు ‘శాంతి’ బహుమతి కేటగిరిలో నామినేషన్ కి రావడం గమనార్హం.
ఇక నోబెల్ శాంతి బహుమతులు అందుకున్నవారిలో 1979లో మదర్ థెరిసా, 1989లో 14వ దలైలామా, 1993లో నెల్సన్ మండేలా, 2009లో బరక్ ఒబామా ఉన్న సంగతి తెలిసిందే.